Leo: రికార్డు సృష్టించిన ‘లియో’.. ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే?

విజయ్‌ ‘లియో’ (Leo) చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్‌ సొంతం చేసుకుంది. దీంతో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకుంది.

Updated : 20 Oct 2023 11:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్: విజయ్‌ (Vijay) హీరోగా తెరకెక్కిన ‘లియో’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ను సొంతం చేసుకుంది. దీంతో కొలీవుడ్‌లో పలు రికార్డులను సృష్టించింది.

అడ్వాన్స్‌ బుకింగ్స్‌లోనే అత్యధిక వసూళ్లు చేసిన ఈ చిత్రం మొదటిరోజు మంచి బిజినెస్‌ చేసింది. సినీ విశ్లేషకుల లెక్కల ప్రకారం తొలిరోజు రూ.140కోట్లకు పైగా రాబట్టింది. దీంతో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన కోలీవుడ్‌ చిత్రంగా రికార్డు సృష్టించింది. అలాగే నార్త్‌ అమెరికాలో అక్టోబర్‌ 19న విడుదలైన అన్ని సినిమాల్లో ‘లియో’ టాప్‌లో నిలిచింది. కోలీవుడ్‌ సినిమా ఇలా ఓవర్సీస్‌లో టాప్‌ వన్‌లో కొనసాగడం చాలా అరుదు అంటూ ఎక్స్‌లో పోస్ట్‌లు పెడుతున్నారు. దీంతో విజయ్ ఫ్యాన్స్‌ తెగ ఖుష్ అవుతున్నారు.

మహేశ్‌ సినిమా వదులుకున్నా.. నిజం చెప్పాలని ఉంది కానీ చెప్పలేను: రేణూ దేశాయ్‌

విడుదలకు ముందు నుంచే ఎన్నో వివాదాలను ఎదుర్కొన్న ఈ చిత్రం నిత్యం వార్తల్లో నిలిచింది. అలాగే తొలిరోజు తెల్లవారుజామున ప్రదర్శనలకు కూడా ప్రభుత్వం అనుమతులివ్వలేదు. వీటన్నింటి మధ్య కూడా ఈ చిత్రం రికార్డులు సృష్టించడంతో చిత్రబృందమంతా ఆనందం వ్యక్తం చేస్తోంది. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్‌ సరసన త్రిష నటించింది. అలాగే పార్తిబన్‌ పాత్రలో విజయ్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని