Vikram: కమల్‌హాసన్‌ ‘విక్రమ్‌’ 25 రోజుల్లో మరో రికార్డు!

‘ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాటేంటో తెలుసా? పదా చూసుకుందాం’ అంటూ బాక్సాఫీస్‌ అంతు చూస్తున్నారు అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌(Kamal hasaan).

Published : 28 Jun 2022 02:06 IST

హైదరాబాద్‌: ‘ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాటేంటో తెలుసా? పదా చూసుకుందాం’ అంటూ బాక్సాఫీస్‌ అంతు చూస్తున్నారు అగ్ర కథానాయకుడు కమల్‌హాసన్‌(Kamal hasaan). లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఆయన నటించిన తాజా చిత్రం ‘విక్రమ్‌’(Vikram). విడుదలై 25 రోజులైనా తమిళనాడులో థియేటర్‌లన్నీ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో ‘విక్రమ్‌’ మరో రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.400కోట్లు వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇప్పటికే తమిళనాడు ‘బాహుబలి’ కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టిన ఈ మూవీ తాజాగా రూ.400కోట్ల క్లబ్‌లో చేరటం విశేషం. ఇండియాలో వివిధ భాషల్లో రూ.284 కోట్లు వసూలు చేయగా, విదేశాల్లో రూ.120 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కమల్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌మూవీగా నిలిచింది. కమల్‌కు దీటుగా విజయ్‌ సేతుపతి(Vijay sethupathi), ఫహద్‌ ఫాజిల్‌(FahadhFaasil) కీలక పాత్రల్లో నటించారు. రోలెక్స్‌గా చివరిలో సూర్య మెరుపులు మెరిపించారు.  ఇక కేరళలోనూ ‘విక్రమ్‌’ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకూ రూ.40కోట్ల వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి. గత కొన్నేళ్లుగా హిట్‌లేక సతమతమైన కమల్‌కు ‘విక్రమ్‌’ మర్చిపోలేని విజయం.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని