Hanuman: అప్పుడే ‘హనుమాన్‌’పై నమ్మకమొచ్చింది..: వినయ్‌ రాయ్‌

ప్రశాంత్ వర్మ టాలెంట్‌కు ‘హనుమాన్’ ఓ ఉదాహరణ అని నటుడు వినయ్‌రాయ్‌ అన్నారు.

Published : 02 Feb 2024 14:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్న సినిమాగా విడుదలై భారీ హిట్‌ను సొంతం చేసుకుంది ‘హనుమాన్‌’ (Hanuman). దీంతో ఈ చిత్రంలోని నటీనటులకు కూడా మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో మైఖేల్ పాత్రలో విలన్‌గా ఆకట్టుకున్న వినయ్‌రాయ్‌ (Vinay Rai) తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ వర్మపై ప్రశంసలు కురిపించారు.

‘ప్రశాంత్‌వర్మ దర్శకత్వంపై నమ్మకంతో ఈ ప్రాజెక్ట్‌ను ఓకే చేశాను. ఇంత గొప్ప సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. వసూళ్లను దృష్టిలో పెట్టుకొని దీన్ని మొదలుపెట్టలేదు. విభిన్నమైన కథను అందించాలనుకున్నాం. ప్రారంభించిన కొన్ని రోజులకే ఇది విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగింది. ఈ సినిమాలో అవకాశం రాగానే సీజీ వర్క్‌ గురించి సందేహించాను. అప్పుడు ప్రశాంత్ వర్మ ‘గతంలో నా సినిమా సీజీ వర్క్‌కు జాతీయ అవార్డు వచ్చింది’ అన్నారు. ఆ ఒక్క మాటతో అతడు తన ప్రాజెక్ట్‌పై ఎంత నమ్మకంగా ఉన్నాడో అర్థమైంది. ప్రశాంత్‌వర్మ ఎంత ప్రతిభావంతుడో ‘హనుమాన్‌’ చూస్తే అర్థమవుతుంది’ అంటూ దీన్ని ఆదరించిన ప్రేక్షకులకు వినయ్‌ రాయ్‌ ధన్యవాదాలు చెప్పారు.

చిరంజీవికి క్షమాపణలు చెప్పిన రచయిత చిన్నికృష్ణ

తాజాగా ప్రశాంత్ వర్మ ఈ చిత్రంలో హనుమంతుడి ఎంట్రీ సీన్‌ గురించి చెప్పిన మాటలు కూడా వైరలవుతున్నాయి. ఆ సన్నివేశాన్ని అయోధ్య బ్యాక్‌డ్రాప్‌లో తీయాలని అనుకున్నారట. ‘ఒక పాప రామ మందిరంలో దీపాలు వెలిగించాలని చూస్తుంటుంది.. కాని గాలి కారణంగా అవి వెలగవు. అదే సమయానికి మందిరం పైనుంచి హనుమాన్‌ వెళ్లగానే.. ఆ దీపాలు వాటికవే వెలుగుతాయి. ఇలా రాసుకున్నా సీన్‌ కొన్ని కారణల వల్ల మార్చాల్సి వచ్చింది’ అని ప్రశాంత్ చెప్పారు. దీంతో ఆ సన్నివేశం ఉంటే చాలా బాగుండేది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్‌ మంచి వసూళ్లు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని