Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్‌ సరసన పూజాహెగ్డే?

సంపత్‌ నంది దర్శకత్వంలో సాయి ధరమ్‌తేజ్‌ ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరలవుతోంది.

Published : 09 Jul 2023 19:37 IST

హైదరాబాద్‌: ‘విరూపాక్ష’ (Virupaksha)తో ఇటీవల మంచి విజయాన్ని అందుకున్న హీరో సాయి ధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej). ప్రస్తుతం ఆయన పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)తో కలిసి ‘బ్రో’ (Bro)  చిత్రంలో నటిస్తున్నాడు. తర్వాత సంపత్‌ నంది(Sampath Nandi) దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. పూర్తిస్థాయి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో పూజాహెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించనుందట. ఇప్పటికే దర్శక, నిర్మాతలు ఆమెను సంప్రదించినట్లు సమాచారం. ఈ చిత్రంలో నటించేందుకు పూజా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని టాక్‌ వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన లేదు. ఈ సినిమా షూటింగ్‌ ఈ ఏడాది చివర్లో ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇందులో సాయిధరమ్‌ తేజ్‌ కొత్త లుక్‌లో కనిపించనున్నారు. పూజా హెగ్డేకు సంబంధించిన మరో వార్త కూడా సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా నుంచి పూజాను హీరోయిన్‌గా తొలగించడంతో మేకర్స్‌ ఆమెతో ఓ స్పెషల్ సాంగ్‌ను చేయించాలని ప్లాన్‌ చేస్తున్నారట. 

‘బ్రో’ సినిమా జులై 28న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహించారు. ‘గుంటూరు కారం’ విషయానికొస్తే.. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత ప్రముఖ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu), దర్శకుడు త్రివిక్రమ్‌ (Trivikram) కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రమిది. ముందుగా ఈ సినిమాలో ప్రధాన నాయికగా పూజా, రెండో నాయికగా శ్రీలీల (Sree Leela) ఎంపికయ్యారు. కారణమేంటో తెలియదుగానీ ఈ సినిమా నుంచి పూజాని తొలగించారని, దాంతో ప్రధాన కథానాయికగా శ్రీలీల నటిస్తోందని ఇటీవల ప్రచారం జరిగింది. రెండో నాయికగా మీనాక్షి చౌదరిని తీసుకుంటున్నారనే టాక్‌ వినిపించింది. ఇప్పటి వరకు దీనిపై స్పష్టత లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని