‘ఐయామ్‌ నాట్‌ ఓకే’అంటున్న విజయ్‌వర్మ!

స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ విజయ్‌వర్మగా ఉగ్రవాదులను ఏరివేస్తున్నారు. ‘ఇది చేస్తుంది మనదేశంలో భయంతో బతుకుతున్న ప్రతీ ఒక్కరి కోసం’ అంటూ ఆయన చెబుతున్న మాటలు ఆలోజింపచేస్తున్నాయి. పట్టుబడిన ఉగ్రవాదులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ ఏమి

Published : 27 Mar 2021 14:22 IST

హైదరాబాద్: స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ విజయ్‌వర్మగా నాగార్జున ఉగ్రవాదులను ఏరివేస్తున్నారు. ‘ఇది చేస్తుంది మనదేశంలో భయంతో బతుకుతున్న ప్రతీ ఒక్కరి కోసం’ అంటూ ఆయన చెబుతున్న మాటలు ఆలోచింపజేస్తున్నాయి. పట్టుబడిన ఉగ్రవాదులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ ఏమీ చేయకుండా నిస్సహాయుడిలా చూడటం నావల్ల కాదంటూ తన టీమ్‌తో కదన రంగలోకి దూకారు. నాటి హైదరాబాద్‌ బాంబు పేలుళ్ల వెనకున్న సూత్రధారులను మట్టుబెడుతున్నారు. ఈ కథంటో తెలియాలంటే ‘వైల్డ్‌డాగ్‌’సినిమా చూడాల్సిందే.

ఏప్రిల్‌ 2న థియేటర్లో మెషిన్‌గన్‌ మోతలతో దద్దరిల్లబోయే ఈ సినిమాలో నాగార్జున స్పెషల్‌ ఆఫీసర్‌ విజయ్‌వర్మగా కనిపించనున్నారు. నాగ్‌ టీమ్‌ను దర్శకుడు అహిషోర్‌ సోలమన్‌ స్క్రీన్‌పై వీరోచితంగా చూపించనున్నారు. ముఖ్యంగా 60వ పడిలో కూడా నాగ్‌ 20 ఏళ్ల కుర్రాడిలా చేస్తున్న స్టంట్స్‌ వావ్‌ అనిపిస్తున్నాయి. వాటన్నింటిని థియేటర్లో చూసేముందు ఈ ప్రోమోపై ఓ లుక్కేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని