Sumanth: సాయికుమార్‌తో సుమంత్‌.. మాంచి కిక్‌ ఇచ్చిన గేమ్‌ షో

‘ఈటీవీ’ వేదికగా ప్రేక్షకులకు మాంచి కిక్‌ ఇచ్చే గేమ్‌ షో ‘వావ్‌’. సాయికుమార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి నటుడు సుమంత్‌, గేయ రచయిత కృష్ణ చైతన్య, కొరియోగ్రాఫర్లు అనీ మాస్టర్‌, సన్నీ విచ్చేశారు.

Updated : 26 Feb 2022 14:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఈటీవీ’ వేదికగా ప్రేక్షకులకు మాంచి కిక్‌ ఇచ్చే గేమ్‌ షో ‘వావ్‌’. సాయికుమార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి నటుడు సుమంత్‌, గేయ రచయిత కృష్ణ చైతన్య, కొరియోగ్రాఫర్లు అనీ మాస్టర్‌, సన్నీ విచ్చేశారు. మార్చి 1న ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌ ప్రోమో ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తోంది. ఆ విశేషాలివీ.. తమ కుటుంబం చిత్ర పరిశ్రమలో ఉన్నందుకు ఓ కారణం అక్కినేని నాగేశ్వరరావు అని సాయికుమార్‌ తెలిపారు. తాను నటించిన ‘మళ్లీ మొదలైంది’ సినిమా ఎలా ప్రారంభమైందో సుమంత్‌ చెప్పారు. ఏఎన్నార్‌ మినహా ఆ కుటుంబంలోని నటులందరికీ తాను పాటలు రాశానన్నారు కృష్ణచైతన్య. అనీ, సన్నీ ‘డీజే టిల్లు’ డ్యాన్స్‌తో అలరించారు. ‘సన్నీ దర్శకుడు అయ్యాడు’ అని సాయికుమార్‌ వివరిస్తుండగా.. ‘కొరియోగ్రాఫర్లుగా కెరీర్‌ ప్రారంభిస్తారు చివరకు దర్శకులవుతారు. అందుకే వారితో మనం మర్యాదగా నడుచుకోవాలి’ అంటూ సుమంత్‌ నవ్వులు పూయించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని