Amtrak train derailed: అమెరికాలో పట్టాలు తప్పిన రైలు.. ముగ్గురి మృతి

అమెరికాలోని మోంటానలో ఒక రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు కనీసం ముగ్గురు చనిపోయినట్లు

Updated : 26 Sep 2021 10:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికాలోని మోంటానలో ఓ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు కనీసం ముగ్గురు చనిపోయినట్లు లిబర్టీ కౌంటీ షరీఫ్‌ పేర్కొన్నారు. ఎంత మంది గాయపడ్డారన్న విషయాన్ని అధికారులు వెల్లడించలేదు.

అమ్‌ట్రాక్(అమెరికా జాతీయ రైల్వే)సంస్థకు చెందిన ఎంపైర్‌ బిల్డర్‌ ట్రైన్‌ 7/27 మోంటానలోని జోప్లిన్‌ వద్ద పట్టాలు తప్పింది. ఈ రైలుకు రెండు లోకోమోటీవ్‌లు, 10 బోగీలు ఉన్నాయి. ప్రమాద సమయంలో 147 మంది ప్రయాణికులు, 13 మంది  సిబ్బంది అందులో ప్రయాణిస్తున్నారు. ఈ రైలు షికాగో నుంచి సెయింట్‌ పౌల్‌కు వెళుతోంది. మోంటాన స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన చోటు చేసుకొంది. ఆమ్‌ట్రాక్‌ అధికారులు, స్థానిక సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు.  ఈ ఘటనపై నేషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సేఫ్టీ బోర్డు వెంటనే దర్యాప్తు చేపట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని