Liquor Bottle Missing: మందు సీసా ఏమైంది మహాశయా!

అమెరికా ప్రభుత్వ వార్షిక ఆడిటింగులో ఇటీవల బయటపడిన ఓ ‘మందు మర్మం’ అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారి..

Published : 08 Aug 2021 10:32 IST

రూ.4.32 లక్షల మద్యం అదృశ్యంపై అమెరికాలో దర్యాప్తు

వాషింగ్టన్‌: అమెరికా ప్రభుత్వ వార్షిక ఆడిటింగులో ఇటీవల బయటపడిన ఓ ‘మందు మర్మం’ అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారి.. ఇపుడు దానిపై విచారణ కూడా జరుగుతోంది. 2019లో అమెరికా విదేశాంగ మంత్రిగా ఉన్న మైక్‌ పాంపియో జపాన్‌ పర్యటనకు వెళ్లినపుడు అక్కడి ప్రభుత్వం ఈయనకు రూ.4.32 లక్షల (5,800 అమెరికన్‌ డాలర్లు) విలువ చేసే విస్కీ సీసా బహుమతిగా ఇచ్చింది. అమెరికా నిబంధనల ప్రకారం ప్రభుత్వ ప్రతినిధులు రూ.29 వేలకు (390 డాలర్లు) మించిన బహుమతులు వ్యక్తిగతంగా వాడుకోరాదు. అంతగా అవసరమైతే దాని ఖరీదు కట్టి సొంతం చేసుకోవచ్చు. ఈ పరిమితి కన్నా ఎన్నో రెట్లు అధిక ధర ఉన్న జపాన్‌ మద్యం సీసా ఏమైందన్నది ఇపుడు లెక్క తేలడం లేదు. ఈ వ్యవహారంపై విచారణ జరుగుతున్నట్లు ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’ వెల్లడించింది. అసలు అటువంటి బహుమతి అందుకున్నట్టే తనకు గుర్తు లేదని మైక్‌ పాంపియో చెబుతున్నారు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు