ఫ్లోరిడాలో ఘనంగా ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలు

అమెరికాలోని ఫ్లోరిడాలో దివంగత నేత, తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మే 27న నిర్వహించిన ఈ కార్యక్రమంలో......

Updated : 31 May 2022 15:17 IST

ఫ్లోరిడా: అమెరికాలోని ఫ్లోరిడాలో దివంగత నేత, తెదేపా వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మే 27న నిర్వహించిన ఈ కార్యక్రమంలో తొలుత ఎన్టీఆర్ అభిమానులు తమ అభిమాన నటుడుకి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ‘జోహార్ అన్న ఎన్టీఆర్’ వంటి నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ గుత్తికొండ అతిథులను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్టీఆర్ తీసుకువచ్చిన ప్రభుత్వ పథకాలు, ఆయన ముక్కుసూటి వ్యక్తిత్వం, చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అలాగే డాక్టర్ కోత శేఖరం మాట్లాడుతూ.. అన్న నందమూరి తారక రామారావు రీల్ స్టార్ నుంచి రియల్ స్టార్‌గా ఎదిగిన ప్రస్థానంలో ఎదుర్కొన్న ఒడిదొడుకుల గురించి చెప్పారు. అనంతరం స్థానిక నేతలు కొందరు ప్రసంగించారు.

ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేయించిన 100 కిలోల కేకును కట్‌ చేసి అందరూ ఎన్టీఆర్‌ శతజయంతి దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లోని పాటలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమం నిర్వహించిన ఫ్లోరిడా ఎన్టీఆర్ అభిమానులు, నాయకులు శ్రీనివాస్ గుత్తికొండ, రాజశేఖర్‌ పోపూరి, రాజ్ శేఖర్ పోపూరి, నాగేందర తుమ్మల, ప్రసాద్ కొసరాజు, అజయ్ దండమూడి, సుధాకర్ మున్నగి, సుమంత్ రామినేని, సుధీర్ వేమూరిలను సభికులు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని