సింగపూరులో ఘనంగా ఒంగోలు తెలుగు తేజం భరతనాట్య రంగప్రవేశం

ప్రకాశం జిల్లా మైనంపాడు గ్రామ గుడిదేని సాయి తేజస్వి భరతనాట్య రంగప్రవేశం సింగపూర్ లో ఘనంగా జరిగింది. ప్రాచీన నాట్య కళలకు ప్రోత్సాహం కరవైన ఈ

Published : 14 Aug 2022 15:38 IST

సింగపూర్‌: ప్రకాశం జిల్లా మైనంపాడు గ్రామ గుడిదేని సాయి తేజస్వి భరతనాట్య రంగప్రవేశం సింగపూర్ లో ఘనంగా జరిగింది. ప్రాచీన నాట్య కళలకు ప్రోత్సాహం కరవైన ఈ రోజుల్లో, ఈ తెలుగు తేజం ప్రదర్శించిన తీరు ఆద్యంతం అలరించింది. ఆగస్టు 13వ తేదీన సింగపూర్‌లోని నేషనల్ యూనివర్సిటీ సాంస్కృతిక కేంద్రంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో సాయి తేజస్వి  ప్రేక్షకులను తన నాట్యకౌశలంతో మెప్పించింది. ఖ్యాతిశ్రీ ఆలపించిన గణేశ ప్రార్థనా గీతంతో కార్యక్రమం మొదలు కాగా, విష్ణు ఆవాహనంతో నృత్యప్రదర్శన ప్రారంభమై, వర్ణం, పదం, అభంగ్, జావళి, థిల్లాన నాట్య అంశాలతో నృత్యప్రదర్శన అత్యంత ఆకర్షణీయంగా, కనులవిందుగా సాగింది. తన హావభావాలతో, నాట్య భంగిమలతో మూడు గంటలపాటు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది. గురువు శ్రీలిజీ శ్రీధరన్ నృత్యాలకు సుందరంగా రూపకల్పన చేశారు. గౌరవ అతిథిగా విచ్చేసిన పద్మశ్రీ గ్రహీత, కూచిపూడి గురువర్యులు పద్మజా రెడ్డి సాయితేజస్విని దీవించారు. ప్రత్యేక అతిథులుగా సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ కోశాధికారి వెంకట్ పద్మనాథన్, కళాక్షేత్ర గురువర్యులు సీతారాజన్, ఆత్మీయ అతిథులుగావిదూషి డా.ఎమ్.ఎస్. శ్రీలక్ష్మి, శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు కవుటూరు  రత్నకుమార్, సామాజిక కార్యకర్త సునీత రెడ్డి, సాయి తేజస్వికి  కుటుంబ సభ్యులు హాజరై ఆమెకు ఆశీస్సులు అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని