కెనడాలో కీలక పదవికి తమిళ సంతతి యువతి పోటీ

కెనడా దేశంలోని బ్రిటిష్‌ కొలంబియా ముఖ్యమంత్రి పదవికి తమిళనాడులో పుట్టిన అంజలి అప్పాదురై అనే యువతి పోటీ పడుతున్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌డీపీ ...

Updated : 03 Sep 2022 08:20 IST

అంజలి అప్పాదురై

సైదాపేట, న్యూస్‌టుడే: కెనడా దేశంలోని బ్రిటిష్‌ కొలంబియా ముఖ్యమంత్రి పదవికి తమిళనాడులో పుట్టిన అంజలి అప్పాదురై అనే యువతి పోటీ పడుతున్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో ఎన్‌డీపీ (న్యూ డెమోక్రటిక్‌ పార్టీ) విజయం సాధించి అధికారం చేజిక్కించుకుంది. ముఖ్యమంత్రిగా జాన్‌ హోర్గన్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో గొంతు క్యాన్సర్‌ కారణంగా పార్టీ నాయకత్వం, ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగనున్నట్లు ఇటీవల ప్రకటించారు. దీంతో పార్టీ అధ్యక్ష పదవికి అంతర్గత ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో బ్రిటిష్‌ కొలంబియాలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న డేవిడ్‌ ఎబి పోటీ చేయనున్నారు. ఆయనకు వ్యతిరేకంగా అంజలి అప్పాదురై బరిలోకి దిగనున్నారు. నవంబర్‌ 13న పార్టీ అంతర్గత ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్‌ 3న ఫలితాలు ప్రకటించనున్నారు. పార్టీ అధ్యక్షుడిగా ఎంపికయ్యేవారు బ్రిటిష్‌ కొలంబియా ముఖ్యమంత్రి అవుతారు. అంజలి అప్పాదురై రాష్ట్రంలోని మదురైలో 1990లో జన్మించారు. చిన్నతనంలో ఇక్కడే ఉన్నారు. ఆమెకు 6 ఏళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కెనడాకు వలస వెళ్లారు. కోక్‌విల్టమ్‌ నగరంలో అంజలి కుటుంబం ఉంటోంది. అంజలి రాజకీయ నేతగా మాత్రమే కాకుండా సామాజిక సేవకురాలిగా కూడా గుర్తింపు పొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని