24 గంటల కథా మారథాన్‌కు విశేష ఆదరణ

మార్చి 19న ప్రపంచ కథా దినోత్సవం సందర్భంగా అమెరికాలోని "బీ ప్లస్ విత్ భాస్కర్" ఛానల్‌ యూట్యూబ్ వేదిక ద్వారా 24 గంటల కథా మారథాన్ నిర్వహించింది.

Published : 21 Mar 2023 11:45 IST

మార్చి 19న ప్రపంచ కథా దినోత్సవం సందర్భంగా అమెరికాలోని "బీ ప్లస్ విత్ భాస్కర్" ఛానల్‌ యూట్యూబ్ వేదిక ద్వారా 24 గంటల కథా మారథాన్ నిర్వహించింది. వేడుకలో తనికెళ్ల భరణి, వంగూరి చిట్టెన్ రాజు, వోలేటి పార్వతీశం, సత్యం మందపాటి, పొత్తూరి విజయలక్ష్మి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. 12 దేశాల నుంచి దాదాపు 126 మంది కథకులు వారి వారి కథలను వినిపించారు. ఈ కథాకళతో పాటు ప్రముఖ చిత్రకారులు, కార్టూనిస్ట్ కూచి సాయి శంకర్ చిత్ర కళా నైపుణ్యం అబ్బురపరిచింది. దాదాపు 30 గంటల పాటు ఒకొక్క కథ వింటూ అప్పటికప్పుడు కథ సారాన్ని ప్రతిబింబించే చిత్రాన్ని వెయ్యడం పలువురి ప్రశంసలు పొంది రికార్డులని సొంతం చేసుకునే దిశగా పయనిస్తోంది. ఇలాంటి ప్రయత్నం ఇప్పటి వరకూ ఎవరూ చేయలేదని, కథా-కళ కలిపి కథా చిత్ర సమ్మేళనాన్ని నిర్వహించడం ఇదే తొలిసారి అని నిర్వాహకులు తెలియజేశారు.  దీంతో "హై రేంజ్ బుక్ ఆఫ్ రికార్డ్స్" లోనే కాకుండా.. "గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్"  లోనూ చోటు దక్కించుకునే అవకాశం ఉందని ‘బీ ప్లస్ విత్ భాస్కర్’ ఛానల్ వారు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని