IT Department: పాన్ విషయంలో ఎన్నారైలకు ఐటీ శాఖ కీలక సూచన
పాన్ చెల్లుబాటులో లేని ప్రవాసభారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా వెంటనే పన్ను చెల్లింపు అధికారులను సంప్రదించాలని ఐటీశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఎన్నారైలు, విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ఆదాయపు పన్ను శాఖ (IT department) కీలక సూచన చేసింది. ఆధార్ అనుసంధానించక పోవడం వల్ల పాన్ (PAN) చెల్లుబాటులో లేని ప్రవాస భారతీయులు( NRI) వెంటనే పన్ను అధికారులను సంప్రదించాలని సూచించింది. పలువురు ఎన్నారైలు తమ పాన్ పనిచేయడం లేదని ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ఈ మేరకు మంగళవారం ఐటీ శాఖ ట్విటర్‌లో స్పందించింది.
ఎన్నారైలు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (ఓసీఐ)లు వారి పాన్ పనిచేయకపోవడంపై ఆందోళన చెందుతున్నట్లు ఐటీ శాఖ పేర్కొంది. అయితే ఎన్నారైలు గత మూడు మదింపు సంవత్సరాల్లో ఏదైనా ఏడాది రిటర్నులు దాఖలు చేయకపోయినా, లేదా వారి నివాస స్థితిని తెలియజేయకపోయినా వారి పాన్ నిరుపయోగంగా మారినట్లు ఐటీ శాఖ తెలిపింది. కాబట్టి ఎవరైతే తమ నివాస స్థితిని తెలియజేయని ఎన్నారైలు ఉంటారో వారు తమ నివాస స్థితిని తెలియజేస్తూ జురిడిక్షన్ అసెస్‌మెంట్ ఆఫీసర్ (JAO)ను సంప్రదించాలని ఐటీ శాఖ సూచించింది.
వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. కాంటాక్ట్ సేవ్ చేయకుండానే మెసేజ్
అయితే పాన్ కార్డు నిరుపయోగంగా మారినంత మాత్రన పాన్ పూర్తిగా క్రియాశీలంగా లేనట్లు కాదని ఐటీ శాఖ పేర్కొంది. నిరుపయోగంగా మారినప్పటికీ ఐటీ రిటర్నులు దాఖలు చేయొచ్చని తెలిపింది. కాకపోతే పెండింగ్ రిఫండ్లు, రిఫండ్లపై వడ్డీ వంటివి రావని మరోసారి స్పష్టం చేసింది. టీడీఎస్, టీఎసీఎస్ ఎక్కువ మొత్తంలో డిడక్ట్ అవుతాయని తెలిపింది. భారత పౌరులు కానివారు, జమ్మూకశ్మీర్, మేఘాలయ, అస్సాం రాష్ట్రాల వారికి ఆధార్- పాన్ అనుసంధానం నుంచి మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
-
2 నిమిషాల్లోనే 50 మ్యాథ్స్ క్యూబ్‌లు చెప్పేస్తున్న బాలిక..
-
పని ఒత్తిడి తట్టుకోలేక సచివాలయ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
-
స్ట్రాంగ్ రూమ్‌కు రంధ్రం.. నగల దుకాణంలో భారీ చోరీ..
-
బాలినేని X ఆమంచి
-
Iraq: పెళ్లి వేడుకలో విషాదం.. అగ్నిప్రమాదంలో 100 మందికి పైగా మృతి