స్విట్జర్లాండ్‌లో చంద్రబాబుకు ప్రవాసాంధ్రుల సంఘీభావం

స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలు చంద్రబాబుకు సంఘీభావంగా నిలిచారు.

Updated : 24 Sep 2023 17:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అక్రమ అరెస్టుపై విదేశాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. ఆయన్ను అరెస్టు చేసినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ తెలుగు ప్రజలు చంద్రబాబుకు మద్దతుగా రోడ్డెక్కుతున్నారు. ఈ క్రమంలోనే స్విట్జర్లాండ్‌లో పలువురు ప్రవాసాంధ్రులు చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులు పట్టుకొని నిరసన తెలిపారు. శనివారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ..  తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం చంద్రబాబు చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. ఆయన వల్లే ఎంతో మంది విద్యార్థులు దేశ విదేశాల్లో స్థిరపడ్డారన్నారు. అంతిమ విజయం ధర్మానిదేనని.. చంద్రబాబు ఎప్పటికీ నిజాయతీకి నిలువుటద్దంగా నిలుస్తారన్నారు. 

ఏపీలో శాంతిభద్రతలు లేవని.. పెట్టుబడులు రావడంలేదని ప్రవాసాంధ్రులు ఆవేదన వ్యక్తంచేశారు. జగన్‌లాంటి చేతకాని వ్యక్తికి అధికారం ఇస్తే గంజాయి, మందు, పేకాట.. ఇలాంటి వ్యవహారాలే తప్ప యువతకు ఉపాధి అవకాశాలు మాత్రం కల్పించడంలేదంటూ మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వస్తేనే ఏపీలో పెట్టుబడులు వచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని విశ్వాసం వ్యక్తంచేశారు. ‘సైకో పోవాలి.. చంద్రబాబు రావాలి.. ఏపీ భవిష్యత్తు బాగుండాలి’ అని ఆకాంక్షిస్తూ నినాదాలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని