బే ఏరియాలో ఘ‌నంగా ఎన్టీఆర్ శతజ‌యంతి వేడుక‌లు

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను అమెరికాలోని బే ఏరియాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన పలు విషయాలను

Published : 30 May 2022 00:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలను అమెరికాలోని బే ఏరియాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎన్నారైలు ఎన్టీఆర్‌ సినీ, రాజకీయ జీవితానికి సంబంధించిన పలు విషయాలను గుర్తు చేసుకున్నారు.  ఈ కార్యక్రమానికి భ‌క్తభ‌ల్లా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తన ట్రేడ్ మార్క్ పంచులతో ఎన్టీఆర్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ర‌జ‌నీకాంత్ కాక‌ర్ల‌ తనదైన శైలిలో ప్రసంగించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వెంక‌ట్ అడుసుమిల్లి తన స్వగ్రామం ఒంగోలులో తెదేపా మహానాడును నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌ జీవితంలోని మేలి మలుపులు, సాధించిన విజయాలను విజ‌య‌కృష్ణ గుమ్మ‌డి, కృష్ణా గొంపా త‌దిత‌రులు వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీకాంత్ దొడ్డ‌ప‌నేని, భ‌క్త భ‌ల్లా, ర‌జ‌నీకాంత్ కాక‌ర్ల‌, క‌ళ్యాణ్ వీర‌ప‌నేని, గాంధి పాపినేని, భరత్ ముప్పిరాళ్ల, భాస్క‌ర్ మొల‌క‌ల‌ప‌ల్లి, భాస్క‌ర్ వ‌ల్ల‌భ‌నేని, అజ‌య్, ల‌క్ష్మ‌ణ్ ప‌రుచూరి, స‌తీష్ బోళ్ల, సందీప్ ఇంటూరి, లియోన్ బోయపాటి, సుధీర్ ఉన్నం, శ్రీనివాస్ తడపనేని, శ్రీధర్ రావుల, క‌ళ్యాణ్, తిరుపతి రావు, సాయి యనమదల, రవి ఆలపాటి, వర్మ, భరణి, సత్య త‌దిత‌రులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని