Omicron: అమెరికా ప్రయాణం ఆంక్షల మయం

ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో కరోనా కట్టడికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కాస్త కఠిన నిర్ణయాలే తీసుకున్నారు.

Published : 04 Dec 2021 12:01 IST

తాజా కొవిడ్‌ నిబంధనలివీ...

వాషింగ్టన్‌: ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో కరోనా కట్టడికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కాస్త కఠిన నిర్ణయాలే తీసుకున్నారు. విదేశాల నుంచి తిరిగొచ్చే అమెరికన్లకు వీటి వల్ల ఇబ్బందులు తప్పకపోవచ్చు! వచ్చేవారంలో ఈ కొత్త నిబంధనలు అమలవుతాయి. వీటి ప్రకారం...
- అమెరికా బయల్దేరడానికి ఒక్కరోజు ముందు చేయించున్న కొవిడ్‌ పరీక్షనే పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో నెగెటివ్‌ వచ్చినట్టు ప్రయాణికులు ధ్రువపత్రం/ఆధారాలను చూపించాలి.
- జాతి, వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండా అమెరికన్లు సహా ప్రయాణికులందరికీ ఇది వర్తిస్తుంది.
- విమానాలు, రైళ్లు, బస్సుల్లో ప్రయాణించేవారు తప్పనిసరిగా మాస్కులను ధరించాలి. జనవరితో ముగిసే ఈ నిబంధన గడువును పొడిగిస్తారు.
- ప్రజారవాణా, పబ్లిక్‌ స్థలాల్లో మాస్కు ధరించని వారికి రూ.37 వేల నుంచి రూ.2.25 లక్షల (500-3,000 డాలర్ల) వరకూ జరిమానా విధిస్తారు.
విదేశాల నుంచి అమెరికా చేరుకున్న అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించాలి. నెగెటివ్‌ వచ్చినా కొద్దిరోజులు క్వారంటైన్‌లో ఉండాలి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని