అమరావతి ‘మహాపాదయాత్ర’కు కువైట్‌ తెదేపా మద్దతుదారుల విరాళం

అమరావతి ఉద్యమానికి ప్రవాసాంధ్రులు సైతం మద్దతు తెలుపుతున్నారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి రైతులు మహాపాదయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్‌లోని తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు తమవంతుగా రూ.లక్ష విరాళం అందించారు....

Published : 07 Nov 2021 22:12 IST

అమరావతి: అమరావతి ఉద్యమానికి ప్రవాసాంధ్రులు సైతం మద్దతు తెలుపుతున్నారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో అమరావతి రైతులు మహాపాదయాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కువైట్‌లోని తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు తమవంతుగా రూ.లక్ష విరాళం అందించారు. కువైట్‌లో ఉంటున్న తెదేపా మద్దతుదారులు పిడికిటి శ్రీనివాస్ చౌదరి, పేరం రమణ, పెరుగు శ్రీను తదితరులు కలిసి అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులకు విరాళానికి సంబంధించిన చెక్కును అందించారు. అమరావతి ఉద్యమానికి తమ వంతు సహకారం అందిస్తామని, రైతులకు అండగా ఉంటామ వెల్లడించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని