Gorantla madhav: నాపై ప్రచారం చేస్తే పాత మాధవ్‌ను చూస్తారు: గోరంట్ల

ఫేక్‌ వీడియోలను తనవిగా చూపేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాబోవని హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు.

Published : 15 Aug 2022 01:12 IST

కర్నూలు: ఫేక్‌ వీడియోలను తనవిగా చూపేందుకు కొందరు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాబోవని హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ అన్నారు. హైదరాబాద్‌ నుంచి అనంతపురం బయలుదేరిన ఎంపీ మాధవ్‌కు కర్నూలు సరిహద్దు టోల్‌గేట్‌ వద్ద కురుమ సంఘం ఆధ్వర్యంలో నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ   మాట్లాడుతూ... మీడియా తనపై అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ, కొన్ని మీడియా సంస్థలు తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నాయన్నారు. వీడియోలు నిజమైనవా? కాదా? అని తేల్చేందుకు పోలీసు వ్యవస్థ ఉందన్న ఆయన.. ఆ పనిని పోలీసులకు వదిలేయాలన్నారు. పోలీసు వ్యవస్థను విధులు నిర్వహించుకునే విధంగా మీడియా ప్రవర్తించాలని, మీడియా పోలీసు డ్యూటీ చెయ్యవద్దని అన్నారు. తనపై ప్రచారం చేస్తే పాత మాధవ్‌ను  చూస్తారంటూ ఆయన శైలిలో హెచ్చరించారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని