Nara Lokesh: హలో వై నాట్‌ 175 జగన్‌.. చలో లండన్‌: నారా లోకేశ్‌

వైకాపా జెండాను శాశ్వతంగా పాతిపెట్టే సమయం వచ్చిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పేర్కొన్నారు.

Updated : 14 Mar 2024 22:15 IST

అమరావతి: వైకాపా జెండాను శాశ్వతంగా పాతిపెట్టే సమయం వచ్చిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. ‘‘ హలో వై నాట్‌ 175 జగన్‌.. చలో లండన్‌. తెదేపా - భాజపా - జనసేన కూటమిదే గెలుపని సర్వేలు చెబుతున్నాయి. ఇండియాటుడే, ఏబీపీ, న్యూస్‌ 18 సర్వేలు కూటమిదే గెలుపని తేల్చేశాయి. సైకో జగన్‌ చేతిలో రాష్ట్రం ధ్వంసమైంది. కూటమితోనే ఏపీ పునర్నిర్మాణం సాధ్యమన్నది జనం నమ్మకం. కూటమిపై ప్రజల నమ్మకాన్ని జాతీయ మీడియా సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఎంపీ స్థానాల్లో తెదేపా, జనసేనదే విజయమని ఇండియాటుడే చెప్పింది. ఏపీలో 20 ఎంపీ స్థానాల్లో ఎన్డీయేదే విజయమని ఏబీపీ సర్వే చెప్పింది. దారుణ పరాజయం నుంచి జగన్‌ గ్యాంగ్‌ తప్పించుకోలేదు. ప్రజావ్యతిరేక తుపానులో వైకాపాకు అంతిమయాత్ర ఖాయం’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని