TDP: ఇలాంటి ఉత్తర్వులు గతంలో ఇవ్వలేదు: ఈసీఐకి తెదేపా లేఖ

ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీకి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలపై తెదేపా నేత  కనకమేడల రవీంద్రకుమార్‌ అభ్యతరం వ్యక్తం చేశారు.

Published : 07 Apr 2024 21:14 IST

అమరావతి: ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీకి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలపై తెదేపా నేత కనకమేడల రవీంద్రకుమార్‌ అభ్యతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని పది రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరినా ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదని లేఖలో పేర్కొన్నారు.

నెల్లూరు రూరల్‌లో ఇంటింటి ప్రచారానికి వెళ్లిన తెదేపా నాయకులపై ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు అభ్యంతరాలు తెలిపి దూషించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ప్రతి రోజు, ప్రతి గ్రామంలో, ప్రతివార్డులో ప్రచారం కోసం అనుమతి తీసుకోవడం సాధ్యం కాదని, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ తరహా ఉత్తర్వులు ఎన్నడూ ఇవ్వలేదన్న విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. డోర్ టు డోర్ ప్రచారం, కరపత్రాల పంపిణీ విషయంలో రాష్ట్ర ఎన్నికల అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని