TS News: రెండు రోజుల్లో 1140 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌: హరీశ్‌రావు

రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీపై ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టత...

Updated : 23 Sep 2022 15:46 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగాల భర్తీపై తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టత ఇచ్చారు. వైద్య కళాశాలల్లో 1140 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్టు వెల్లడించారు. వీటితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ)లోనూ వైద్యుల కొరత తీర్చేందుకు మరో పది రోజుల్లో వెయ్యి మంది వైద్యులను పూర్తిస్థాయిలో భర్తీ చేసేలా ఆదేశాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో ఇన్ఫెక్షన్‌ నియంత్రణ కోసం చేపట్టిన చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని 30 టీచింగ్‌ ఆస్పత్రులకు చెందిన వైద్యులు, నర్సులకు నిమ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

‘‘బోధనా ఆస్పత్రుల్లో దాదాపు 1,140 అసిస్టెంట్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటన్నింటినీ భర్తీ చేసేందుకు వచ్చే రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ ఇస్తాం. రెండు నుంచి మూడు నెలల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తాం. అన్నీ సమకూరుస్తాం.. అన్ని రకాలుగా మద్దతుఅందిస్తాం. అంతిమంగా మాకు కావాల్సింది ప్రజలకు అత్యుత్తమ సేవలు. ఆ సేవలకు కొలమానం ప్రజల నుంచి సంతృప్తి.. ఆస్పత్రికి వచ్చే రోగులకు సంతృప్తికరమైన సేవలు అందించడమే చాలా ముఖ్యం’’ అని సూచించారు. ఈ కార్యక్రమంలో నిమ్స్‌ ఇంఛార్జి డైరెక్టర్‌ రామ్మూర్తి, సూపరింటెండ్‌ సత్యనారాయణ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ శ్వేతా మహంతి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని