పొట్టికప్పునకు హార్దిక్‌ ఎంపికవుతాడా?

ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌ చేయలేకపోతే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికవుతాడా అని ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే ప్రశ్నించాడు.

Updated : 15 Apr 2024 09:12 IST

దిల్లీ: ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య బౌలింగ్‌ చేయలేకపోతే టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు ఎంపికవుతాడా అని ప్రముఖ వ్యాఖ్యాత హర్ష భోగ్లే ప్రశ్నించాడు. చీలమండ గాయం కారణంగా అయిదు నెలలు ఆటకు దూరంగా ఉన్న పాండ్య.. ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఐపీఎల్‌తో పునరాగమనం చేశాడు. అయితే ఫిట్‌నెస్‌ సమస్యలతో పాండ్య పూర్తి స్థాయిలో బౌలింగ్‌ చేయలేకపోతున్నాడు. ‘‘బౌలింగ్‌ చేయలేకపోయినా టీ20 ప్రపంచకప్‌కు హార్దిక్‌ ఎంపికవుతాడా? బౌలింగ్‌ చేయకపోతే భారత్‌లో టాప్‌-6   బ్యాటర్లలో పాండ్య ఉండగలడా? దీనిపై పూర్తిగా ఏకీభవించలేకపోతున్నా. అత్యున్నత స్థాయి టోర్నీలో బౌలింగ్‌ చేయనప్పుడు బ్యాటర్‌గా మెరుగ్గా రాణించాలి’’ అని భోగ్లే అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని