ధ్యానానికి యాప్‌ సాయం!

అసలే ఉరుకుల పరుగుల జీవితాలు. ఆపై కరోనా భయం. దీంతో ఎంతోమంది ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు. వీటికి యాప్‌లు ఓ ‘మెడిటేషన్‌’ మార్గం చూపెడుతున్నాయి. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ వేరియంట్లలో ఇవి ఉచితంగా, రుసుముతో అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో ప్రయాణాలు చేస్తున్నా కూడా ఇట్టే ధ్యానంలో మునిగిపోవచ్చు.

Updated : 28 Apr 2021 10:56 IST

అసలే ఉరుకుల పరుగుల జీవితాలు. ఆపై కరోనా భయం. దీంతో ఎంతోమంది ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి వంటి వాటితో ఇబ్బంది పడుతున్నారు. వీటికి యాప్‌లు ఓ ‘మెడిటేషన్‌’ మార్గం చూపెడుతున్నాయి. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ వేరియంట్లలో ఇవి ఉచితంగా, రుసుముతో అందుబాటులో ఉన్నాయి. వీటి సాయంతో ప్రయాణాలు చేస్తున్నా కూడా ఇట్టే ధ్యానంలో మునిగిపోవచ్చు.

ఆరా...  

‘ఫైండ్‌ పీస్‌’ అంటూ ప్రశాంతతకు బాటలు వేసే కృత్రిమ మేధ యాప్‌ ఇది. మూడు నిమిషాల వ్యవధితో కూడిన సెషన్స్‌ దీని ప్రత్యేకత. క్రమంగా సమయాన్ని పెంచుకోవచ్చు. మంచి నిద్ర, ఒత్తిడి, ఆందోళన, కోపాల నియంత్రణ, ప్రశాంతత, ధ్యానం, యోగా ఇలా ఎన్నో అంశాల్లో ఉపయోగపడుతుంది. కథలు, ప్రకృతి శబ్దాలు, సంగీతం వంటివీ అందుబాటులో ఉన్నాయి.

బుద్ధిఫై

మీలోని ప్రశాంత ‘బుద్ధుడి’ని బుద్ధిపై యాప్‌ ద్వారా మేల్కొలుపుకోవచ్చు. దీనిలోని 80కి పైగా మార్గదర్శక మెడిటేషన్‌ సెషన్లు మనసుని ప్రశాంత స్థితిలోకి తీసుకెళతాయి. ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఆడియో లేకుండా సోలో సెషన్‌ను ఎంచుకోవచ్చు.

కామ్‌

ఇది శ్వాస తీరు, ధ్యానం, విశ్రాంతి, నిద్ర లాంటివి మరింత స్థిరంగా కొనసాగేలా చూడటానికి ఉపయోగపడే ఉచిత వెబ్‌, స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌. రోజూ దీంతో ధ్యానం చెయ్యడం వల్ల మన ఆలోచనా విధానంలో స్థిమితత్వం వస్తుంది. ఏకాగ్రత పెరుగుతుంది. సహనం, శ్రద్ధ, దయ వంటివి అలవడతాయి. ఇందులో స్లీప్‌ స్టోరీస్‌ చదువుకుంటూ గాఢ నిద్రలోకి జారుకోవచ్చు.

పాజ్‌

ఇతర వాటితో పోల్చితే వైవిధ్యమైన పెయిడ్‌ యాప్‌ ఇది. ఇందులో ఫోన్‌ స్క్రీన్‌ని వేలితో తాకుతూ దృశ్య, శబ్ద సంకేతాలను అనుసరిస్తూ ఉంటే చాలు. ఒత్తిడితో కూడిన, క్లిష్టమైన పరిస్థితుల్లోనూ మానసిక ప్రశాంతతను సాధించొచ్చు.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని