అందుకే ఛార్జర్.. ఇయర్‌పాడ్స్ ఇవ్వలేదంట..!
ఐఫోన్ ప్రియులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 12 ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చేసింది. గత వారం వర్చువల్ ఈవెంట్ ద్వారా యాపిల్ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. ముందు నుంచి వినిపించిన ఊహాగానాలను నిజం చేస్తూ...
ఇంటర్నెట్‌డెస్క్: ఐఫోన్ ప్రియులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 12 ఎట్టకేలకు మార్కెట్లోకి వచ్చేసింది. గత వారం వర్చువల్ ఈవెంట్ ద్వారా యాపిల్ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లను విడుదల చేసింది. ముందు నుంచి వినిపించిన ఊహాగానాలను నిజం చేస్తూ యూఎస్బీ అడాప్టర్, ఇయర్‌పాడ్స్‌ను బాక్స్ నుంచి తొలగించింది. దీనిపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తినప్పటికీ యాపిల్ వాదన మరోలా ఉంది. కంపెనీ పర్యావరణ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాపిల్ తెలిపింది. అందులో భాగంగా ఛార్జర్, ఇయర్‌పాడ్స్‌ను తొలగించినట్లు చెప్పుకొచ్చింది. దీని ద్వారా 70 శాతం మేర ప్యాకింగ్ కెపాసిటీని తగ్గించి వాటికి బదులు మరిన్ని డివైజ్‌లను ట్రాన్స్పోర్ట్ చెయ్యొచ్చని యాపిల్ చెబుతోంది. దాని వల్ల సరఫరా కోసం ఎక్కువ వాహనాలు ఉపయోగించాల్సిన అవసరం ఉండదట. అలా వాహన వినియోగం తగ్గించడం ద్వారా ఏటా సుమారు రెండు మిలియన్ మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని యాపిల్ చెబుతోంది. ఇది సుమారు 4,50,000 కార్లు రోడ్లపై విడుదల చేసే కర్బన ఉద్గారాలకు సమానమట.
దాంతో పాటు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ద్వారా వచ్చే ఈ-వేస్ట్‌ను తగ్గించాలని యాపిల్ భావిస్తోంది. ఏటా ఫోన్ ఛార్జర్లు, ఇతర యాక్ససరీస్ వల్ల సుమారు 51,000 టన్నుల ఈ-వేస్ట్ పోగవుతోందట. దీన్ని తగ్గించడంలో భాగంగానే ఛార్జర్ ఇవ్వలేదని యాపిల్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల ఐఫోన్ ఛార్జర్లు, 700 మిలియన్ల ఇయర్‌పాడ్స్ ఉన్నాయని, తమ నిర్ణయంతో ఐఫోన్ కొనుగోలుదారులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని యాపిల్ ఐఫోన్ 12 విడుదల సందర్భంగా ఆ కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ఐఫోన్‌కి మారేవారి దగ్గర యూఎస్బీ-సీ టైప్ పవర్ అడాప్టర్స్ ఉంటాయని, అవి ప్రతి ఐఫోన్‌తో వచ్చే యూఎస్బీ-సీ-లైటెనింగ్ ఛార్జింగ్ కేబుల్‌కు సపోర్ట్ చేస్తాయని పేర్కొంది. అలానే యాపిల్ మాక్ కంప్యూటర్లు, టాబ్లు, ఐపాడ్ల ఛార్జర్లను కూడా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అయితే ఛార్జర్స్, ఐపాడ్స్ కొత్తవి కావాలనుకునే వారి కోసం గతంలో కంటే తక్కువ ధరకే వాటిని విక్రయించనున్నట్లు యాపిల్ ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెదడులాంటి కంప్యూటర్!
మనిషి మెదడులా పనిచేసే, ఒకే సమయంలో వేర్వేరుగా స్పందించే కంప్యూటర్లను రూపొందించాలని చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దిశగా ఇంటెల్ శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద న్యూరోమార్ఫిక్ కంప్యూటర్ను రూపొందించారు. -
నాచులో నత్రజని ఫ్యాక్టరీ
ప్రకృతిలో బ్యాక్టీరియా, ప్రాణులు ఒకదాని మీద మరోటి ఆధారపడటం (సింబయోటిక్) మామూలే. కానీ ఆ బ్యాక్టీరియా ప్రాణిలో భాగంగా మారితే? శక్తినందించే వనరుగా పరిణమిస్తే? అలాంటి విషయాన్నే శాస్త్రవేత్తలు గుర్తించారు. -
లిథియం బ్యాటరీ పేలకుండా..
ఇప్పుడు లిథియం-అయాన్ బ్యాటరీలు లేని డిజిటల్ పరికరాలను ఊహించుకోలేం. సెల్ఫోన్ల దగ్గరి నుంచి స్మార్ట్‌వాచ్‌ల వరకూ అన్నింటికీ ఇవే ఆధారం. ఐప్యాడ్, మ్యాక్, ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్, ట్రిమ్మర్ వంటివీ వీటితోనే పనిచేస్తాయి. -
‘కీప్’ గోయింగ్!
రోజురోజుకీ నోట్-టేకింగ్ యాప్స్‌కు ఆదరణ పెరుగుతోంది. వివిధ ప్రయోజనాలు ఉండటంతో యువత వీటిని ఎక్కువగా వాడుతున్నారు. ఇప్పుడు బోలెడన్ని ఉచిత నోట్ టేకింగ్ యాప్‌లూ అందుబాటులో ఉన్నాయి. -
అణువు మందం బంగారు పొర
బంగారాన్ని పొరలుగా మలచటం తెలుసు. కానీ అతి పలుచటి.. ఆ మాటకొస్తే కేవలం అణువు మందం పొరగా మలచటం చాలా కష్టం. ఇందుకోసం శాస్త్రవేత్తలు చాలాకాలంగా ప్రయత్నిస్తున్నారు. -
అమెజాన్ మ్యూజిక్‌లో ఏఐ ప్లేలిస్టు ఫీచర్
సంగీత ప్రియులను ఆకట్టుకోవటానికి మ్యూజిక్ యాప్‌లు కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో కొత్త పుంతలు తొక్కుతున్నాయి. స్పోటిఫై ఇటీవల ప్రీమియం యూజర్ల కోసం ఏఐ ఆధారిత ప్లేలిస్ట్ జనరేటర్‌ను అందుబాటులోకి తెచ్చింది. -
వాట్సప్ ఛాట్ ఫిల్టర్
వాట్సప్ గత కొన్నిరోజులుగా గోప్యతను కాపాడుతూనే ఎన్నో వినూత్న ఫీచర్లు పరిచయం చేస్తోంది. ఎక్కువ మందికి మెటా ఏఐని అందుబాటులోకి తేవటం దగ్గరి నుంచి యాప్ నుంచే బస్ టికెట్లు కొనుక్కోవటానికి వీలు కల్పించటం వరకూ ఎన్నో సదుపాయాలను ఆరంభించింది. -
వెబ్‌లోనూ ట్రూకాలర్
స్మార్ట్ఫోన్లలో ట్రూకాలర్‌ను చాలాకాలంగా వాడుతూనే ఉన్నాం. అజ్ఞాత, స్పామ్ కాల్స్‌ను గుర్తించటానికిది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడిది వెబ్ బ్రౌజర్ రూపంలోకీ మారింది. -
నక్షత్రాలూ సంచరిస్తాయి!
నక్షత్ర మండలంలో కోట్లాది నక్షత్రాలుంటాయి. సాధారణంగా ఇవి తమ నక్షత్ర మండలానికే పరిమితమవుతాయి. కానీ కొన్ని మాత్రం నక్షత్ర మండలాల మధ్య తిరుగుతుంటాయి. తమ నక్షత్ర మండలం గురుత్వాకర్షణకు కట్టుబడి ఉండవు. -
వెబ్క్యామే స్కానర్
డెస్క్‌టాప్ ఉంది గానీ స్కానర్ లేదా? పోనీ వెబ్‌క్యామ్ అయినా ఉందా? అయితే దీన్నే స్కానర్‌లా వాడుకుంటే సరి. మ్యాక్‌లోనైతే- ఫొటో బూత్‌ను ఓపెన్ చేసి, డాక్యుమెంట్‌ను వెబ్‌క్యామ్ ముందుకు తీసుకురావాలి. -
దైవకణం కథ
అది అన్ని కణాలకూ ద్రవ్యరాశిని సంతరింపజేస్తుంది. దీని గురించి 1960ల్లోనే తెలిసినా 50 ఏళ్ల తర్వాత గానీ ఉనికి బయటపడలేదు. ప్రపంచంలోనే అతి పెద్ద, అతి సంక్లిష్ట యంత్రం సాయం తీసుకుంటే తప్ప అది సాధ్యం కాలేదు. -
జీపీటీ దృష్టి!
టెక్నాలజీ రంగంలో ఇప్పుడు ఛాట్‌జీపీటీ పేరు మార్మోగుతోంది. ఆరంభమైనప్పటి నుంచే సంచలనాలు సృష్టిస్తోంది. రోజురోజుకీ కొత్త పోకడలు పోతోంది. ఆన్లైన్లో టెక్స్ట్‌ను సంగ్రహించి, మథించటంతోనే ఆగిపోలేదు. -
హాయ్ ఐయామ్ నమో ఏఐ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టెక్నాలజీ వాడకంలో ఎప్పుడూ ముందే ఉంటారు. ఆయన వ్యక్తిగత నమో యాప్ గురించి తెలిసిందే. దీనికి తాజాగా కృత్రిమ మేధతో కూడిన నమో ఏఐ ఫీచర్ కూడా జతచేరింది. -
ఆండ్రాయిడ్ పరికరాల్లో సరికొత్త ఫొటో ఎడిటింగ్
డిజిటల్ ప్రపంచం రోజురోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ పరికరాలూ కొత్త సొబగులు అద్దుకుంటున్నాయి. వీటికి త్వరలో కొత్త ఏఐ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. -
రోడ్డు గుంతలను పూడ్చే రోబో
గుంతలు లేని రోడ్లను ఒకసారి తలచుకోండి. ఆ ప్రయాణం ఎంత హాయిగా ఉంటుందో! ఊహించుకుంటేనే ఎంత సంతోషం కలుగుతుందో కదా. అదే నిజమైతే? అది సాకారం కావటం మరెంతో దూరంలో లేదు. -
అశ్లీల బెదిరింపుల వలలో పడకుండా
ఆన్లైన్లో నగ్న చిత్రాలు, వీడియోలతో బెదిరించటాన్ని అడ్డుకోవటానికి ఇన్స్టాగ్రామ్ కొత్తగా న్యూడిటీ ప్రొటెక్షన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టనుంది. ఇన్స్టాగ్రామ్ డీఎంలలో ఉండే ఈ ఫీచర్ దానంతటదే నగ్న చిత్రాలను పసిగడుతుంది. -
పాటలు నేర్పే పదనిస
హిందీ పాటలు పాడటం నేర్చుకోవాలని భావిస్తున్నారా? కానీ సమయం దొరకటం లేదని చింతిస్తున్నారా? అయితే పదనిస యాప్‌ను ప్రయత్నించి చూడండి. ప్రముఖ సంగీత కంపెనీ సరిగమ ఇటీవలే దీన్ని తీసుకొచ్చింది. -
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
కాల మహిమ
ఉగాది రోజు పంచాంగం విన్నారా? దీనిలోని తిథులు, రోజులు, పక్షాలు, నెలలు, రుతువులు.. అన్నీ కాల గమన సంకేతాలే. అసలు కాలమంటే ఏంటి? అది ఎలా మొదలైంది? ఇలాగే కొనసాగుతుందా? అంతమవుతుందా? -
సామాజిక వ్యసనం శ్రుతి మించుతోందా?
సామాజిక మాధ్యమాలు వ్యసనంగా మారాయా? దీన్నుంచి బయట పడటానికి ప్రయత్నిస్తున్నారా? అయితే పామ్సీ యాప్ సాయం తీసుకోవచ్చు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్‌కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్‌కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్‌తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్