ఫోన్‌ బ్యాటరీ ఎన్నిసార్లు ఛార్జ్‌ అవుతుంది?

స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ పూర్తిగా.. అంటే 0 నుంచి 100% వరకు ఎన్నిసార్లు ఛార్జ్‌ అవుతుంది? ఎవరు లెక్కపెట్టొచ్చారని పెదవి విరవకండి. దీని గురించి తెలిస్తే బ్యాటరీ ఎక్కువ కాలం మన్నేలా కాపాడుకోవచ్చు మరి

Published : 10 Jan 2024 00:13 IST

స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ పూర్తిగా.. అంటే 0 నుంచి 100% వరకు ఎన్నిసార్లు ఛార్జ్‌ అవుతుంది? ఎవరు లెక్కపెట్టొచ్చారని పెదవి విరవకండి. దీని గురించి తెలిస్తే బ్యాటరీ ఎక్కువ కాలం మన్నేలా కాపాడుకోవచ్చు మరి. సాధారణంగా చాలా ఫోన్‌ బ్యాటరీలను 300 నుంచి 500 సార్ల వరకూ పూర్తిగా ఛార్జ్‌ అయ్యేలా రూపొందిస్తుంటారు. ఛార్జింగుల సంఖ్య అంతకుమించిన కొద్దీ బ్యాటరీ మన్నిక తగ్గుతూ వస్తుంది. త్వరగా నిండుకుంటుంది. బ్యాటరీ ఛార్జింగ్‌ను 20% కన్నా తగ్గకుండా, 80% కన్నా మించకుండా చూసుకుంటే ఎక్కువకాలం మన్నే అవకాశముంది. ఎవరు వేచి చూస్తారని కొందరు రాత్రంతా ఛార్జింగ్‌ పెట్టేసి, పొద్దున తీసేస్తుంటారు. ఇలాంటి పని మాత్రం చేయొద్దు. ఎప్పుడన్నా ఒకసారి ఫోన్‌ బ్యాటరీ 100% నుంచి 0 శాతానికి చేరుకునేంతవరకు వాడుకోవటమూ మంచిదే. దీంతో బ్యాటరీ రీక్యాలిబరేట్‌ అయ్యే అవకాశముంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని