క్రోమ్‌లోనే ఫొటో రీసైజ్‌

ఆన్‌లైన్‌లో పత్రాలు, వివరాలు నింపటం కష్టంతో కూడుకున్న పని. ముఖ్యంగా వివిధ డాక్యుమెంట్లు, ఫొటోలు అప్‌లోడ్‌ చేయటం అంత తేలిక కాదు. విద్యాసంస్థలు, ప్రభుత్వ సేవలు, ఉద్యోగ అన్వేషణకు సంబంధించిన వెబ్‌సైట్లు పెద్ద పెద్ద ఫొటోలను అప్‌లోడ్‌ చేయటానికి అనుమతించవు.

Published : 12 Jan 2022 00:45 IST

ఆన్‌లైన్‌లో పత్రాలు, వివరాలు నింపటం కష్టంతో కూడుకున్న పని. ముఖ్యంగా వివిధ డాక్యుమెంట్లు, ఫొటోలు అప్‌లోడ్‌ చేయటం అంత తేలిక కాదు. విద్యాసంస్థలు, ప్రభుత్వ సేవలు, ఉద్యోగ అన్వేషణకు సంబంధించిన వెబ్‌సైట్లు పెద్ద పెద్ద ఫొటోలను అప్‌లోడ్‌ చేయటానికి అనుమతించవు. పెద్ద ఫొటోలో లక్షలాది పిక్సెల్స్‌ ఉంటాయి. వీటిని స్టోర్‌ చేస్తే సర్వర్‌లో లక్షలాది బైట్లను ఆక్రమిస్తాయి. అందుకే చిన్న ఫొటోలనే వెబ్‌సైట్లు అనుమతిస్తుంటాయి. వీటికి తగినట్టుగా ఫొటోల సైజు తగ్గించటానికి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇందుకు చాలా మార్గాలే ఉన్నాయి గానీ క్రోమ్‌ ఎక్స్‌టెన్షన్‌ ద్వారానూ దీన్ని తేలికగా చేసుకోవచ్చు. దీంతో క్రోమ్‌ బ్రౌజర్‌తోనే ఫొటోల సైజును తగ్గించుకోవచ్చు. అప్‌లోడ్‌ చేసుకోవచ్చు.
* పీసీలో గూగుల్‌ క్రోమ్‌ బ్రౌజర్‌ను తెరవాలి. https://chrome.google.com/webstore ద్వారా క్రోమ్‌ వెబ్‌స్టోర్‌కు వెళ్లాలి. సెర్చ్‌ బార్‌లో ‘రీసైజింగ్‌ యాప్‌’ అని టైప్‌ చేయాలి.
* ఫలితాల్లో కనిపించే రీసైజింగ్‌ యాప్‌ మీద ట్యాప్‌ చేయాలి.
* కుడివైపున ఉండే ‘యాడ్‌ టు క్రోమ్‌’ బటన్‌ను నొక్కాలి.
* ఇది డౌన్‌లోడ్‌ అయ్యాక ఎక్స్‌టెన్షన్‌ విభాగంలో కుదురుకుంటుంది. యాప్‌ గుర్తు మీద ట్యాప్‌ చేసి ఎప్పుడైనా వాడుకోవచ్చు. ఇంటర్నెట్‌కు పీసీ కనెక్ట్‌ కాకున్నా ఇది పనిచేస్తుంది.
* ఎక్స్‌టెన్షన్‌ను క్లిక్‌ చేశాక చిన్నగా పాప్‌ అప్‌ అయ్యే విండోలో ప్లస్‌ గుర్తు మీద క్లిక్‌ చేయాలి.
* ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌ సాయంతో రీసైజ్‌ చేయాలనుకుంటున్న ఇమేజ్‌ను ఎంచుకోవాలి.
* ఇప్పుడు ఎంతవరకు సైజు తగ్గించాలని అనుకుంటే అంత పర్సెంటేజీని ఎంటర్‌ చేయాలి.
* తర్వాత సేవ్‌ ఇమేజ్‌ను నొక్కాలి. సైజు తగ్గిన ఫొటో డౌన్‌లోడ్స్‌ ఫోల్డర్‌లో సేవ్‌ అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని