వాట్సప్‌ మెసేజ్‌లు రహస్యంగా..

వాట్సప్‌ మెసేజ్‌ల బ్లూటిక్‌ గురించి తెలిసిందే. దీంతో మెసేజ్‌లను చదివారో లేదో అనే విషయం పంపించినవారికి తెలుస్తుంది. బ్లూటిక్‌ లేకపోతే చదవలేదనే అర్థం. అయితే కొన్నిసార్లు మనం చదివినా ఆ విషయం పంపించినవారికి తెలియకూడదనే సందర్భాలు ఎదురవ్వచ్చు.

Updated : 24 Aug 2022 17:42 IST

వాట్సప్‌ మెసేజ్‌ల బ్లూటిక్‌ గురించి తెలిసిందే. దీంతో మెసేజ్‌లను చదివారో లేదో అనే విషయం పంపించినవారికి తెలుస్తుంది. బ్లూటిక్‌ లేకపోతే చదవలేదనే అర్థం. అయితే కొన్నిసార్లు మనం చదివినా ఆ విషయం పంపించినవారికి తెలియకూడదనే సందర్భాలు ఎదురవ్వచ్చు. అప్పుడెలా? దీనికీ అవకాశముంది. అదీ థర్డ్‌ పార్టీ యాప్‌లతో పనిలేకుండా. రీడ్‌ రిసిప్ట్స్‌ను డిసేబుల్‌ చేయటం, చిన్నపాటి ఉపాయాలతో ఆఫ్‌లైన్‌లో చూడటం ద్వారా దీన్ని సాధించొచ్చు.
* వాట్సప్‌ను ఓపెన్‌ చేసి నిలువు మూడు చుక్కల మీద నొక్కాలి.
* తర్వాత సెటింగ్స్‌ను ఎంచుకొని, అకౌంట్‌ ఆప్షన్‌ మీద ట్యాప్‌ చేయాలి.
* ‘ప్రైవసీ’ విభాగం మీద తాకి అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లను పరిశీలించాలి. రీడ్‌ రిసిప్ట్స్‌ ఫీచర్‌ను డిసేబుల్‌ చేయాలి. అంతే.

నోటిఫికేషన్‌ బార్‌ ద్వారా
* రహస్యంగా మెసేజ్‌లను చదవటానికి ఉన్న మరో మార్గం నోటిఫికేషన్‌ బార్‌ ద్వారా చదవటం. వాట్సప్‌ మెసేజ్‌ నోటిఫికేషన్‌ అందిన వెంటనే దాన్ని కిందికి జరిపి చదివితే చాలు.

పాపప్స్‌ ద్వారా
* వాట్సప్‌ సెటింగ్స్‌ను ఓపెన్‌ చేసి, నోటిఫికేషన్స్‌ మీద తాకాలి.
* పాపప్‌ నోటిఫికేషన్‌ ఫీచర్‌ మీద తాకాలి. ఇందులో ఓన్లీ వెన్‌ ద స్క్రీన్‌ ఈజ్‌ ఆఫ్‌, ఆల్వేస్‌ షో పాపప్‌, ఓన్లీ వెన్‌ స్క్రీన్‌ ఈజ్‌ ఆన్‌.. ఈ మూడు ఆప్షన్లలో ఏదైనా ఒకటి ఎంచుకోవాలి.
* అప్పుడు నోటిఫికేషన్లు పాపప్‌ రూపంలో కనిపిస్తాయి. వాటిని చదివితే బ్లూటిక్‌ పడదు.

విడ్జెట్‌ ద్వారా
* వాట్సప్‌ మెసేజ్‌లను విడ్జెట్‌ ద్వారా చదవాలని అనుకుంటే.. వాట్సప్‌ను హోం స్క్రీన్‌ మీదికి తెచ్చుకుంటే చాలు. యాప్‌ను ఓపెన్‌ చేయకుండానే అన్ని మెసేజ్‌లనూ చదవొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని