ఇక వాట్సప్‌లో హెచ్‌డీ ఫొటోలు

వాట్సప్‌లో ఇకపై హై రెజల్యూషన్‌ ఫొటోలూ షేర్‌ చేసుకోవచ్చు. ఇప్పటివరకూ బీటా టెస్టింగ్‌లోనే కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను ఇప్పుడు అందరికీ విస్తరించారు.

Updated : 23 Aug 2023 01:54 IST

వాట్సప్‌లో ఇకపై హై రెజల్యూషన్‌ ఫొటోలూ షేర్‌ చేసుకోవచ్చు. ఇప్పటివరకూ బీటా టెస్టింగ్‌లోనే కొందరికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను ఇప్పుడు అందరికీ విస్తరించారు. దీన్ని వాడుకోవాలంటే ముందుగా వాట్సప్‌ను తాజా వర్షన్‌కు అప్‌డేట్‌ చేసుకోవాలి. అప్పుడు ఫొటో షేరింగ్‌ స్క్రీన్‌లో ఇతర ఎడిటింగ్‌ టూల్స్‌ పక్కన కొత్త హెచ్‌డీ బటన్‌ కనిపిస్తుంది. దీన్ని తాకితే కొత్త పాపప్‌ ఓపెన్‌ అవుతుంది. దీని ద్వారా ఫొటో క్వాలిటీని ఎంచుకోవచ్చు. ఫొటోలను వేగంగా పంపించుకోవటం కోసం డిఫాల్ట్‌గా స్టాండర్డ్‌ క్వాలిటీ ఎంపికై ఉంటుంది. ఇప్పుడు దీనికి బదులు మరింత నాణ్యమైన హెచ్‌డీ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. ఇలాంటి ఫొటోలను అందుకున్నవారికి కింద ఎడమ వైపు మూలన హెచ్‌డీ లేబుల్‌ కనిపిస్తుంది. ఒకవేళ బ్యాండ్‌విడ్త్‌ తక్కువగా ఉన్నప్పుడు హెచ్‌డీ ఫొటోలు అందితే వాటిని స్టాండర్డ్‌ వర్షన్‌లోనే ఉంచుకోవచ్చు. కావాలనుకుంటే హెచ్‌డీకి అప్‌గ్రేడ్‌ చేసుకోవచ్చు.

  • ఫొటో, వీడియో, గిఫ్‌, డాక్యుమెంట్ల వ్యాఖ్యలను సవరించుకునే ఫీచర్‌నూ వాట్సప్‌ తీసుకురానుంది. ఇప్పటికే కొందరు యూజర్లకిది అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే మరికొందరికి విస్తరించనున్నారు. చిన్న అక్షర దోషాలను సవరించుకోవటానికి, అదనపు విషయాన్ని జోడించుకోవటానికిది వీలు కల్పిస్తుంది. క్యాప్షన్‌తో కూడిన మీడియా మెసేజ్‌ను పంపించిన తర్వాత 15 నిమిషాల్లోపు సవరించుకోవచ్చు. మెసేజ్‌ మీద నొక్కి పడితే ఎడిట్‌ ఫీచర్‌ కనిపిస్తుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని