వాట్సప్‌లో కొత్త భద్రత

యూజర్ల భద్రత కోసం వాట్సప్‌ త్వరలో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. వాట్సప్‌ కాల్‌ చేస్తున్నప్పుడు ఐపీ అడ్రస్‌ను కాపాడటం దీని ఉద్దేశం. ఇలా మోసగాళ్లు లొకేషన్‌ను గుర్తించకుండా అడ్డుకుంటుంది.

Updated : 18 Oct 2023 00:52 IST

యూజర్ల భద్రత కోసం వాట్సప్‌ త్వరలో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. వాట్సప్‌ కాల్‌ చేస్తున్నప్పుడు ఐపీ అడ్రస్‌ను కాపాడటం దీని ఉద్దేశం. ఇలా మోసగాళ్లు లొకేషన్‌ను గుర్తించకుండా అడ్డుకుంటుంది. కాకపోతే వాట్సప్‌ సర్వర్ల ద్వారా మాటలు ప్రసారమవుతున్నప్పుడు యూజర్ల కనెక్షన్‌ రూటింగ్‌, ఎన్‌క్రిప్ట్‌ చేయటం వల్ల ఈ ప్రైవసీ కాల్‌ నాణ్యత కాస్త తక్కువగా ఉండొచ్చు. అయితేనేం? యూజర్ల లొకేషన్‌, ఐపీ అడ్రస్‌ను కనుక్కోవటానికి చేసే ప్రయత్నాలను ఇది నిర్వీర్యం చేస్తుంది. అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌ విషయంలో ఇదెంతగానో భద్రత కల్పిస్తుంది. హ్యాకర్లు మన వ్యక్తిగత సమాచారాన్ని తేలికగా సంగ్రహించకుండా చేస్తుంది. ప్రైవసీ సెటింగ్స్‌లో కొత్త అడ్వాన్స్‌డ్‌ విభాగంలో ఈ ఫీచర్‌ ఉంటుంది. దీన్ని ప్రస్తుతం వాట్సప్‌ బీటా తాజా వర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకున్న కొందరు బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. త్వరలో మరికొందరికి విస్తరించనున్నారు.  మున్ముందు అందరికీ వర్తింపజేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని