ఎవరీ మెసేజ్‌ పంపింది?

ఉదయం ఫోన్‌ తెరిచారు. ‘మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు’ అనే సందేశం కనిపించింది. పంపిన వారి పేరు లేదు. నంబరు ఎవరిదో కూడా గుర్తులేదు.

Published : 25 Oct 2023 00:36 IST

దయం ఫోన్‌ తెరిచారు. ‘మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు’ అనే సందేశం కనిపించింది. పంపిన వారి పేరు లేదు. నంబరు ఎవరిదో కూడా గుర్తులేదు. కానీ పరిచయమైవారే అనిపిస్తోంది. ‘మీరెవరు?’ అని మెసేజ్‌ పెడితే ఏమనుకుంటారో. ఇలాంటి పరిస్థితుల్లో అవతలివారి పేరు తెలుసుకోవటమెలా? మనకు పేమెంట్‌ యాప్‌లో ఖాతా ఉన్నట్టయితే, దాని సాయం తీసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది గూగుల్‌ పే, ఫోన్‌ పే వంటి యాప్‌లతో డబ్బులు చెల్లిస్తున్నారు కదా. అవతలివారు వీటిల్లో నమోదై ఉంటే వెంటనే పేరు తెలిసిపోతుంది. మెసేజ్‌ పంపించిన వారి నంబరును కాపీ చేసి, పేమెంట్‌ యాప్‌లో పేస్ట్‌ చేస్తే పేరేంటో తెలిసిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని