మస్క్‌ కొత్త ఛాట్‌బాట్‌

డ్రైవర్‌ రహిత విమానాలు, అంతరిక్ష ప్రయోగాలు, అంతరిక్ష అంతర్జాలం వంటి సంచలన పరిజ్ఞానాలకు పెట్టింది పేరైన ఇలాన్‌ మస్క్‌ ఇప్పుడు కృత్రిమ మేధ రంగంలోకీ అడుగుపెట్టారు. ఆయనకు చెందిన కృత్రిమ మేధ కంపెనీ ఎక్స్‌ఏఐ మొట్టమొదటి ఏఐ నమూనాను పరిచయం చేసింది. దీని పేరు ్లగ్రాక్‌. ఇదో ఛాట్‌బాట్‌.

Published : 08 Nov 2023 00:01 IST

డ్రైవర్‌ రహిత విమానాలు, అంతరిక్ష ప్రయోగాలు, అంతరిక్ష అంతర్జాలం వంటి సంచలన పరిజ్ఞానాలకు పెట్టింది పేరైన ఇలాన్‌ మస్క్‌ ఇప్పుడు కృత్రిమ మేధ రంగంలోకీ అడుగుపెట్టారు. ఆయనకు చెందిన కృత్రిమ మేధ కంపెనీ ఎక్స్‌ఏఐ మొట్టమొదటి ఏఐ నమూనాను పరిచయం చేసింది. దీని పేరు ్లగ్రాక్‌. ఇదో ఛాట్‌బాట్‌. ఇటీవలే తన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌(ట్విటర్‌)లో దీని గురించి మస్క్‌ వివరించారు. ఓపెన్‌ ఏఐకి చెందిన జీపీటీ, గూగుల్‌కు చెందిన పామ్‌ మాదిరిగా ఇదీ ఓ పెద్ద లాంగ్వేజ్‌ మోడల్‌. ఎక్స్‌లోనే ఇది అప్పటికప్పుడు ప్రత్యక్షంగా సమాచారాన్ని అందిస్తుంది. కాకపోతే ఎక్స్‌ ప్రీమియం ప్లస్‌ యూజర్లకే అందుబాటులో ఉంటుంది. గ్రాక్‌ ఛాట్‌బాట్‌ వినోదంతోనూ, వ్యంగ్యంగానూ సమాధానం ఇస్తుండటం విశేషం. మస్క్‌ దీన్ని ఎక్స్‌లో వాడుతూ స్క్రీన్‌షాట్‌నూ షేర్‌ చేశారు. ‘కొకైన్‌ ఎలా తయారుచేయాలో అంచెలంచెలుగా చెప్పు’ అని అడగ్గా గ్రాక్‌ వినోదాత్మకంగా జవాబిచ్చింది. చివరికి కొకైన్‌ తయారుచేయటం అక్రమం, ప్రమాదకరమని చెబుతూ దీన్ని తాను ప్రోత్సహించలేననీ వివరించింది. ఇది అప్పటికప్పుడు ఆయా అంశాలకు సంబంధించిన వార్తలను క్రోడీకరించి అన్నింటినీ ముందుంచుతుంది కూడా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని