జీమెయిల్‌ లేకున్నా యూట్యూబ్‌ ఖాతా

యూట్యూబ్‌లో సైన్‌ఇన్‌ అయ్యేటప్పుడు గూగుల్‌ మన జీమెయిల్‌ అడ్రస్‌ను అడగటం తెలిసిందే. అయితే కేవలం ఒక్క జీమెయిల్‌ ఐడీతోనే కాదు.. ఇతర ఈమెయిల్‌ సర్వీసులతోనూ యూట్యూబ్‌ ఖాతాను తెరవచ్చు.

Updated : 27 Feb 2024 14:53 IST

యూట్యూబ్‌లో సైన్‌ఇన్‌ అయ్యేటప్పుడు గూగుల్‌ మన జీమెయిల్‌ అడ్రస్‌ను అడగటం తెలిసిందే. అయితే కేవలం ఒక్క జీమెయిల్‌ ఐడీతోనే కాదు.. ఇతర ఈమెయిల్‌ సర్వీసులతోనూ యూట్యూబ్‌ ఖాతాను తెరవచ్చు. దాంతోనే యూట్యూబ్‌కు సైన్‌ఇన్‌ కావొచ్చు. ఇందుకోసం థర్డ్‌పార్టీ సర్వీసులేవీ అక్కర్లేదు. సైన్‌ఇన్‌ పత్రంలోనే డిఫాల్ట్‌ అవకాశాన్ని గూగుల్‌ కల్పిస్తుంది. నిజానికి ప్రస్తుతం చాలామంది జీమెయిల్‌నే ఉపయోగిస్తున్నారు. అప్పటికే వేరే ఈమెయిల్‌ను వాడుతున్నవారు కొత్తగా మరోటి ఎందుకనీ అనుకోవచ్చు. పాత మెయిల్‌తోనే యూట్యూబ్‌ ఛానెల్‌ ఆరంభించొచ్చనీ భావించొచ్చు. ఇలాంటివారికి ఇతర మెయిల్‌ అవకాశం బాగా ఉపయోగపడుతుంది.

  • ముందుగా యూట్యూబ్‌లోకి వెళ్లి.. పైన కుడి వైపున కనిపించే సైన్‌ ఇన్‌ బటన్‌ మీద నొక్కాలి.
  • సైన్‌ ఇన్‌ పేజీలో మోర్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి.
  • క్రియేట్‌ అకౌంట్‌ ఫీచర్‌ను ఎంచుకోవాలి. అప్పుడు గూగుల్‌ అకౌంట్‌ క్రియేషన్‌ పేజీ కనిపిస్తుంది. ఇది గూగుల్‌ ఖాతాను ఓపెన్‌ చేయటానికి నింపే పత్రం మాదిరిగా ఉండదు. ఇందులో ‘ఐ వుడ్‌ లైక్‌ ఎ జీమెయిల్‌ అడ్రస్‌’ లింక్‌ కనిపిస్తుంది. ఇందులో యువర్‌ ఈమెయిల్‌ అడ్రస్‌ విభాగంలో వేరే ఈమెయిల్‌ ఐడీని కూడా పేర్కొనొచ్చు.
  • బాక్సుల్లో అన్ని వివరాలు పొందు పరచిన తర్వాత ‘నెక్స్ట్‌ స్టెప్‌’ బటన్‌ మీద నొక్కాలి. అప్పుడు గూగుల్‌కు చెందిన ప్రైవసీ అండ్‌ టర్మ్స్‌కు అంగీకరించాలని అడుగుతుంది. ఐ అగ్రీ మీద క్లిక్‌ చేయాలి.
  • పత్రంలో పేర్కొన్న మెయిల్‌కు గూగుల్‌ ధ్రువీకరణ లింక్‌ను పంపుతుంది. ఆ ఈమెయిల్‌లోకి వెళ్లి ధ్రువీకరణ లింక్‌ మీద క్లిక్‌ చేయాలి.
  • దీంతో యూట్యూబ్‌ ఖాతా ఓపెన్‌ అవుతుంది. జీమెయిల్‌ కాకుండా వేరే ఈమెయిల్‌తో సైన్‌ ఇన్‌ కావటానికి మార్గం సుగమం అవుతుంది. దీన్ని గూగుల్‌ డాక్స్‌, గూగుల్‌ ప్లే సర్వీస్‌ వంటి ఇతర సర్వీసులకూ వాడుకోవచ్చు. అయితే దీన్ని జీమెయిల్‌ కోసం వాడుకోలేం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని