అధిక బరువుకు మాత్ర!

బరువు తగ్గాలంటే వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయటానికేమో బద్ధకం. కొన్నిసార్లు వ్యాయామం చేయటానికి శరీరమూ సహకరించకపోవచ్చు. మరి బరువు తగ్గటమెలా?

Published : 07 Sep 2022 00:27 IST

బరువు తగ్గాలంటే వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయటానికేమో బద్ధకం. కొన్నిసార్లు వ్యాయామం చేయటానికి శరీరమూ సహకరించకపోవచ్చు. మరి బరువు తగ్గటమెలా? ఏదైనా మాత్ర ఉంటే బాగుండు. చాలాసార్లు ఇలాగే అనిపిస్తుంటుంది. ఇప్పుడంటే ఏమో గానీ మున్ముందు వ్యాయామం మాదిరి ఫలితాలతో బరువును తగ్గించే మాత్రలు అందుబాటులోకి రావొచ్చు. ‘ల్యాక్‌-ఫే’ అనే మాలిక్యూల్‌ను ఎలుకలకు పెద్ద మొత్తంలో ఇస్తే ఆహారం తీసుకోవటం సగానికి తగ్గిపోతున్నట్టు తేలటం దీనికి ఆస్కారం కలిగిస్తోంది. మనం వ్యాయామం చేస్తున్నప్పుడు ఈ మాలిక్యూల్‌ సహజంగానే శరీరంలో పుట్టుకొస్తుంది. అందుకే పరిశోధకులు దీని ప్రభావాలపై అధ్యయనం నిర్వహించారు. ఇది ఏదో ఒకనాడు బరువు తగ్గించే మాత్రల తయారీకి దారితీయగలదని గట్టిగానే భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని