రోబో సూది!

రోబోలు రోజురోజుకీ గొప్ప నైపుణ్యాలను సంతరించు కుంటున్నాయి. సున్నితమైన సర్జరీలు చేసే స్థితికీ చేరు కుంటున్నాయి.

Updated : 21 Dec 2022 05:13 IST

రోబోలు రోజురోజుకీ గొప్ప నైపుణ్యాలను సంతరించు కుంటున్నాయి. సున్నితమైన సర్జరీలు చేసే స్థితికీ చేరు కుంటున్నాయి. ఒక వైద్య రోబో మానవ నియంత్రణ లేకుండానే పందుల ఊపిరితిత్తుల్లోకి మృదువైన సూదిని దూర్చటమే దీనికి నిదర్శనం. దీన్ని యూనివర్సిటీ ఆఫ్‌ నార్త్‌ కరోలినా పరిశోధకులు రూపొందించారు. ఇది డాక్టర్ల కన్నా మరింత కచ్చితంగా సూదిని జొప్పించటం విశేషం. కణజాలాల్లోంచి చిన్న ముక్కను తీయటం, నిర్దేశిత భాగానికి మందులను ఇవ్వటం వంటి వాటికి సూదులను వాడుతుంటారు. ఇలాంటి ప్రక్రియలకు కొత్త రోబో పరిజ్ఞానం ఉపయోగపడగలదని భావిస్తున్నారు. దీన్ని పరీక్షించటానికి ముందుగా పందుల ఊపిరితిత్తులో క్యాన్సర్‌ కణితిని 3డీ ఎక్స్‌రేలుగా తీసి కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌తో పటాన్ని రూపొందించారు. అనంతరం రోబో నియంత్రణలో పనిచేసే సూదికి పని అప్పజెప్పారు. ఇది ఊపిరితిత్తి కణజాలం ద్వారా లోపలికి వెళ్లి, కచ్చితంగా కణితి వరకు చేరుకుంది. మృదువుగా ఉండటం వల్ల గాలి గదులకు, రక్తనాళాలకు ఎలాంటి హాని చేయకుండా.. సున్నితంగా అడ్డంకులను తప్పించుకుంటూ లక్ష్యాన్ని సాధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని