నియర్‌బై షేర్ తరహా..గూగుల్ కొత్త ఫీచర్‌

ఆండ్రాయిడ్ యూజర్స్‌ కోసం గూగుల్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా యూజర్స్ తమ వైఫై నెట్‌వర్క్‌ పాస్‌వర్డ్‌ని ఇతరులతో సులభంగా షేర్ చేసుకోవచ్చు. గూగుల్‌ నియర్‌బై షేర్ ద్వారా కొత్త ఫీచర్‌ పనిచేస్తుంది...

Updated : 22 Jan 2021 14:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆండ్రాయిడ్ యూజర్స్‌ కోసం గూగుల్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా యూజర్స్ తమ వైఫై నెట్‌వర్క్‌ పాస్‌వర్డ్‌ని ఇతరులతో సులభంగా షేర్ చేసుకోవచ్చు. గూగుల్‌ నియర్‌బై షేర్ ద్వారా కొత్త ఫీచర్‌ పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌లో ఈ ఫీచర్‌ను యూజర్స్‌కి పరిచయం చేయనున్నారు. యాపిల్ ఎయిర్‌డ్రాప్ తరహాలోనే ఇది పనిచేస్తుంది. దీని ద్వారా ఆండ్రాయిడ్ యూజర్స్‌ ఫొటోలు, వీడియోలు, గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి యాప్స్‌, గూగుల్‌ మ్యాప్‌ లొకేషన్స్‌ని దగ్గర్లో ఉన్న ఇతర ఆండ్రాయిడ్ యూజర్స్‌తో షేర్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఆండ్రాయిడ్‌ 10 ఓఎస్‌ యూజర్స్‌కి క్యూఆర్‌ కోడ్ ఆధారంగా వైఫై పాస్‌వర్డ్ షేర్ చేసుకునే ఫీచర్ అందుబాటులో ఉంది. 

షేర్‌ వైఫై పేరుతో ఈ ఏడాడి ద్వితీయార్థంలో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తారని సమాచారం. ఇప్పటికే దీని సంబంధించిన కార్యచరణను గూగుల్‌ ప్రారంభించింది. ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌లో వైఫై బటన్‌పై లాంగ్‌ ప్రెస్ చేయడం ద్వారా ఈ ఫీచర్‌ యాక్టివేట్ అవుతుంది. దీనితో పాటు గూగుల్ ‘యాప్‌ పెయిర్స్‌’ అనే మరో కొత్త ఫీచర్‌ని కూడా ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌లో పరిచయం చేయనుంది. దీని ద్వారా యూజర్స్ వేర్వేరు డివైజ్‌లలో ఉన్న ఒకే రకమైన యాప్స్‌ని జత చెయ్యొచ్చు. 

ఇవీ చదవండి..

క్రోమ్‌ 88లో పాస్‌వర్డ్‌లు పదిలం..

2020తో ఆడేస్తారా..ఎలాగంటే..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని