గేటెడ్‌ కమ్యూనిటీకి ‘మై గేట్‌’

గేటెడ్‌ కమ్యూనిటీల్లో.. ఆపార్ట్‌మెంట్లలో ఉంటున్నారా? అయితే.. మెయిన్‌టెనెన్స్‌ విషయంలో చాలా విషయాలు ఆలోచించాల్సి ఉంటుంది...

Published : 24 Feb 2021 19:02 IST

రక్షణగా స్మార్ట్‌ నిఘా వ్యవస్థ

గేటెడ్‌ కమ్యూనిటీల్లో.. అపార్ట్‌మెంట్లలో ఉంటున్నారా? అయితే.. నిర్వహణలో చాలా విషయాలు ఆలోచించాల్సి ఉంటుంది. అది కరోనా తర్వాత ఇంకాస్త ఎక్కువే అయ్యింది. లోపలికి వస్తున్నదెవరు? వెళ్తున్నదెవరు? సెక్యూరిటీ గార్డులు సరిగా చెక్‌ చేస్తున్నారా? లేదా? రిజిస్టర్‌లో సరిగా నోట్‌ చేస్తున్నారా? లేదా?.. ఇలా ఎన్నో అంశాల్ని మేనేజ్‌ చేయాల్సి వస్తోంది. అలాంటప్పుడు పాత పద్ధతుల్ని ఎందుకు ఫాలో అవ్వాలి? స్మార్ట్‌ విధానాల్ని ఎంచుకోవడమే కరెక్ట్‌. ఇదిగోండి ‘మైగేట్‌’ యాప్‌. సెక్యూరిటీ, కమ్యూనిటీ మేనేజ్‌మెంట్‌కి ఇదో చక్కని నిఘా వ్యవస్థ. దేశంలో ఎక్కువ శాతం గేటెడ్‌ కమ్యూనిటీల్లో ఇప్పటికే సేవలు అందిస్తున్న నమ్మకమైన యాప్‌.. దీంట్లో అందుబాటులో ఉన్న సర్వీసుల్ని తెలుసుకుంటే మీ దాంట్లోనూ వాడేస్తారు. మరెందుకు ఆలస్యం.. ఓ లుక్కేద్దాం పదండి..

ఫోన్‌ నుంచే అన్నీ..

ఇంటా.. బయటా ఎక్కడకి వెళ్లినా సామాజిక దూరం పాటిస్తున్న నేపథ్యంలో కొత్త వారు ఎవరైనా ఇంటికి వస్తే ఇంకెంత జాగ్రత్త పడతాం. అపార్ట్‌మెంట్‌లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో వాచ్‌మెన్‌ లేదా సెక్యూరిటీ గార్డులు కూడా అంతే అప్రమత్తంగా ఉంటున్నారు. ఈ క్రమంలో మీ కోసం ఎవరు వచ్చినా మీ అనుమతి కోసం ల్యాడ్‌లైన్‌కో.. ఫోన్‌కో పదే పదే ఫోన్‌ చేస్తుంటారు. మీరు లిఫ్ట్‌ చేయకపోతే వచ్చిన వారిని వెయిట్‌ చేయించడం.. కాసేపటికి లోనికి పంపేయడం చేస్తుంటారు. ఈ మొత్తం ప్రక్రియకి స్మార్ట్‌గా చెక్‌ పెట్టేందుకు మైగేట్‌ యాప్‌లో ‘ఎంట్రీ పాస్‌కోడ్‌’ని వాడొచ్చు. ఉదాహరణకు మీ ఫ్లాట్‌లో పని చేసే వంట మనిషి, సేవకులు, పాలబ్బాయ్, డ్రైవర్‌.. ఇలా ఎవరైనా లోపలికి వచ్చేందుకు వారికో ప్రత్యేక పాస్‌కోడ్‌ని ఇవ్వొచ్చు. దాన్ని సెక్యూరిటీలో ఎంటర్‌ చేసి లోపలికి వెళ్లొచ్చు. ఇలా కమ్యూనిటీలో పని చేసే వారందరికీ ఎంట్రీ పాస్‌కోడ్‌ని ఇవ్వొచ్చు. అనుకోకుండా వచ్చే విజిటర్ల సంగతేంటి? చాలా సింపుల్‌.. మీ ఫోన్‌కి నోటిఫికేషన్‌ వస్తుంది. ఎలాగంటే.. ఆన్‌లైన్‌లో మీకేదైనా డెలివరీ వస్తే మీ ఫోన్‌కి నోటిఫికేషన్‌ వస్తుంది. ‘పార్సిల్‌ లోపలికి తీసుకురావాలా? గేట్‌ దగ్గర వదిలేయాలా?..’ అని అనుమతి కోరుతుంది. ఎంచుకున్న ఆప్షన్‌ ఆధారంగా డెలివరీ బాయ్‌ స్పందించొచ్చు.


పిల్లలపై నిఘా..

అపార్ట్‌మెంట్లలో ఉన్నప్పుడు పిల్లలు ఆడుకుంటూ బయటికి వెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో కట్టుదిట్టమైన రక్షణ వ్యవస్థగా ‘మైగేట్‌’ పని చేస్తుంది. ఎవరైనా పిల్లలు బయటికి వెళ్లాలని ప్రయత్నిస్తే.. ‘కిడ్స్‌ చెక్‌అవుట్‌’ ఫీచర్‌ పేరెంట్స్‌ తెరపై ప్రత్యక్షమవుతుంది. ‘పిల్లలు బయటికి వెళ్లేందుకు వచ్చారు.. వారిని పంపమంటారా?’ అని తల్లిదండ్రుల్ని అనుమతి కోరుతూ నోటిఫికేషన్‌ వెళ్తుంది. వారి స్పందన మేరకు గేటు ఓపెన్‌ అవుతుంది. ఇక ఎప్పుడైనా అతిథులు వస్తే.. ముందే ప్రత్యేక పాస్‌కోడ్‌ని క్రియేట్‌ చేసి వారికి పంపొచ్చు. దీంతో సెక్యూరిటీ గేటు దగ్గర వారికి ఎలాంటి అవాంతరాలు ఎదురు కాకుండా క్షణాల్లో లోపలికి చెక్‌ఇన్‌ అవ్వొచ్చు. ఇదే మాదిరిగా డెలివరీ బాయ్స్‌కి కూడా ముందే అనుమతులు ఇవ్వొచ్చు. ఆన్‌లైన్‌లో ఏదైనా తినేందుకు ఆర్డర్‌ చేసినప్పుడు డెలివరీ బాయ్‌కి సంబంధించిన వివరాల్ని సెక్యూరిటీకి ముందే పంపి అనుమతిని షెడ్యూల్‌ చేయొచ్చు. అంతేకాదు.. అవసరం అయినప్పుడు యాప్‌లోని మొత్తం డేటాతో ఎవరెవరు.. ఎప్పుడు.. ఏ సమయానికి ఇంటికి వచ్చి వెళ్లారో చెక్‌ చేసి చూసుకునే వీలుంది. 


కరోనాకు ప్రత్యేకం..

‘కొవిడ్‌ ప్రొటెక్షన్‌’ ఫీచర్‌తో కమ్యూనిటీల్లో క్వారంటైన్‌ను కట్టుదిట్టంగా అమలు చేయొచ్చు. సొసైటీ కమిటీ సభ్యులకు ఉన్న సమాచారం మేరకు ఏదైనా ఫ్లాట్‌లో ఎవరైనా కరోనా భారిన పడితే, ఆ ఫ్లాట్‌ని యాప్‌లో క్వారంటైన్‌ జోన్‌గా మార్క్‌ చేస్తారు. ఆ సమయంలో సంబంధిత ఫ్లాట్‌కు ఎలాంటి రాకపోకలు సాగించేందుకు వీలుండదు. క్వారంటైన్‌ కాలం ముగిశాక ఫ్లాట్‌ని అన్‌బ్లాక్‌ చేస్తారు. దీంతో అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీల్లో కరోనా వ్యాప్తి చెందకుండా స్మార్ట్‌గా అడ్డుకోవచ్చు. ఇక యాప్‌లో అదనపు ఫీచర్ల విషయానికొస్తే.. ‘లోకల్‌ సర్వీసెస్‌’ ఉంది. దీంట్లో కమ్యూనిటీల్లో పలు సర్వీసులకు అందుబాటులో ఉన్న వారి జాబితా కనిపిస్తుంది. ఉదాహరణకు మీకో డ్రైవర్‌ అవసరం ఏర్పడితే.. అందుబాటులో ఉన్నవారిని చూడొచ్చు. ఎవరెవరు ఏయే సమయాల్లో ఫ్రీగా ఉన్నారో చెక్‌ చేసుకుని, వారితో మాట్లాడొచ్చు. పని మనిషి అవసరమైనా ఇదే మాదిరిగా వెతికి, వారితో కాంటాక్ట్‌ అవ్వొచ్చు. ఇంకా చెప్పాలంటే.. మెయిన్‌టెనెన్స్‌ బిల్లులు చెల్లించేందుకు ‘హెల్ప్ ‌డెస్క్‌’ ఉంది. ఫిర్యాదుల్ని తెలుసుకునేందుకు ‘నోటీస్‌ బోర్డు’ ఉంది. 

* మరిన్ని వివరాలకు: https://mygate.com

* యాప్‌ డౌన్‌లోడ్‌ కోసం: http://bit.ly/2ZKHiSn

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని