ల్యాప్‌టాప్‌ మార్కెట్లోకి శాంసంగ్‌ రీఎంట్రీ.. కొత్తగా తీసుకొచ్చినవి ఇవే..

శాంసంగ్ కంపెనీ భారత మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. గెలాక్సీ బుక్‌2 సిరీస్‌ పేరుతో ఆరు కొత్త మోడల్స్‌ను పరిచయం చేసింది.

Published : 18 Mar 2022 01:26 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ (Samsung) లాప్‌టాప్‌/పీసీ శ్రేణిలో తిరిగి తన ప్రయాణాన్ని కొనసాగించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు భారత మార్కెట్లోకి గెలాక్సీ బుక్‌2 సిరీస్‌ (Galaxy Book2 Series)లో కొత్త పీసీ మోడల్స్‌ను విడుదల చేసింది. గెలాక్సీ బుక్‌2 సిరీస్‌, గెలాక్సీ బుక్‌2 బిజినెస్‌ శ్రేణిలో ఆరు కొత్త మోడల్స్‌ను పరిచయం చేసింది. బిజినెస్‌ మోడల్‌లో 12వ జనరేషన్‌ ఇంటెల్ కోర్‌ ప్రాసెసర్‌ను, గెలాక్సీ బుక్‌2 సిరీస్‌లో స్నాప్‌డ్రాగన్‌ 7సీ జనరేషన్‌ 2ను ఉపయోగించారు. విండోస్‌ 11 ఓఎస్‌ ఈ ల్యాప్‌టాప్‌లు పనిచేస్తాయి.

శాంసంగ్‌ గెలాక్సీ బుక్‌2 సిరీస్‌ ల్యాప్‌టాప్‌ల బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 21 గంటల బ్యాటరీ లైఫ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. వీడియో కాలింగ్‌ కోసం 1080 పిక్సెల్‌ హెచ్‌డీ వెబ్‌ కెమెరాను అమర్చారు. ఇందులో ఏఐ నాయిస్‌ క్యాల్సిలేషన్‌ ఫీచర్‌ కూడా ఉంది. డాల్బీ అట్‌మోస్‌ సౌండ్‌ టెక్నాలజీ, 14-అంగుళాల డిస్‌ప్లే వంటి ఫీచర్లున్నాయి. మార్చి 18 నుంచి గెలాక్సీ బుక్‌ సిరీస్‌ ముందస్తు బుకింగ్స్‌ ప్రారంభించనున్నట్లు శాంసంగ్‌ తెలిపింది. వీటి ధర రూ.38,990 నుంచి రూ. 1.16 లక్ష మధ్య ఉంటుందని సంస్థ వెల్లడించింది. వినియోగదారుల అవసరాలను అనుగుణంగా అత్యుత్తమ పనితీరు, మెరుగైన డిజైన్‌తో యూజర్‌కు సరికొత్త అనుభూతిని అందించాలనే ఉద్దేశంతో శాంసంగ్‌ గెలాక్సీ బుక్‌ సిరీస్‌ ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చామని శాంసంగ్ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ రాజు పుల్లాన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని