ఆండ్రాయిడ్‌తో శాంసంగ్‌కు కొత్త చిక్కులు

శాంసంగ్ తీసుకొచ్చిన ఆండ్రాయిడ్ 11 వన్‌ యూఐ 3.0 ఓఎస్‌తో ఆ కంపెనీకి కొత్త సమస్య మొదలైంది. ఈ ఓఎస్ కారణంగా గెలాక్సీ ఫోన్లు, ట్యాబ్‌లలో బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్ పనిచేయడంలేదని డోంట్‌కిల్‌మైయాప్ అనే వెబ్‌సైట్ తెలిపింది....

Published : 19 Feb 2021 20:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శాంసంగ్ తీసుకొచ్చిన ఆండ్రాయిడ్ 11 వన్‌ యూఐ 3.0 ఓఎస్‌తో ఆ కంపెనీకి కొత్త సమస్య మొదలైంది. ఈ ఓఎస్ కారణంగా గెలాక్సీ ఫోన్లు, ట్యాబ్‌లలో బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్ పనిచేయడంలేదని డోంట్‌కిల్‌మైయాప్ అనే వెబ్‌సైట్ తెలిపింది. శాంసంగ్ గతేడాది నవంబరులో సరికొత్త డిజైన్‌‌, ఫీచర్స్‌తో వన్‌ యూఐ 3.0ని తీసుకొచ్చింది. ఈ ఏడాది వన్‌ యూఐ 3.0 ఓ‌ఎస్‌ కారణంగా బ్యాక్‌గ్రౌండ్ యాప్స్‌ పనిచేయని ఫోన్ల జాబితాలో శాంసంగ్ ముందు వరుసలో ఉంది. బ్యాటరీ ఆప్టిమైజేషన్‌ నుంచి మినహాయింపునిస్తేనే సదరు యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో పనిచేసేందుకు ఓఎస్‌ అనుమతిస్తున్నట్లు తెలిపింది. ఒకవేళ మీ ఫోన్‌లో ఈ సమస్యను గుర్తిస్తే..సెట్టింగ్స్‌లోకి వెళ్లి యాప్స్‌ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అందులో బ్యాటరీపై క్లిక్ చేస్తే బ్యాటరీ ఆప్టిమైజేషన్ ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి ఆల్ యాప్స్‌లోకి వెళ్లి డోంట్ ఆప్టిమైజ్‌పై క్లిక్ చేయాలి.  ఈ సమస్యను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గతేడాదే స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లకు గూగుల్ కొన్ని సూచనలు చేసింది. అయితే ఫోన్ కంపెనీలు గూగుల్ సూచనలను పాటించడంలేదని సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని