Samsung A22: రెండ్రోజుల ముందే వచ్చేసింది

శాంసంగ్ కంపెనీ గెలాక్సీ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గతంలో విడుదలైన గెలాక్సీ ఏ21ఎస్‌కి కొనసాగింపుగా గెలాక్సీ ఏ22 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో వాటర్‌డ్రాప్‌ స్టైల్ నాచ్‌ డిస్‌ప్లే, క్వాడ్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. గతంలో ప్రకటించిన విడుదల తేదీ కంటే ముందుగానే...

Published : 30 Jun 2021 21:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శాంసంగ్ కంపెనీ గెలాక్సీ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. గతంలో విడుదలైన గెలాక్సీ ఏ21ఎస్‌కి కొనసాగింపుగా గెలాక్సీ ఏ22 పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్‌లో వాటర్‌డ్రాప్‌ స్టైల్ నాచ్‌ డిస్‌ప్లే, క్వాడ్ కెమెరా ఫీచర్లు ఉన్నాయి. గతంలో ప్రకటించిన విడుదల తేదీ కంటే ముందుగానే శాంసంగ్‌ ఈ ఫోన్‌ను విడుదల చేయడం గమనార్హం. మరి ఈ ఫోన్‌లో ఇంకా ఏమేం ఫీచర్లున్నాయి..దీని ధరెంతో చూద్దాం.

గెలాక్సీ ఏ22 ఫీచర్స్‌... 

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌యూఐ 3.1 కోర్‌ ఓఎస్‌తో పనిచేస్తుంది. 90Hz రిఫ్రెష్‌ రేటుతో 6.4-అంగుళాల హెచ్‌డీ+ సూపర్ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనక మూడు.. ముందు ఒక కెమెరా అమర్చారు. వెనకవైపు 48 ఎంపీ మెయిన్ కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 2 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. ముందు భాగంలో సెల్ఫీ/వీడియో కాల్స్‌ కోసం 13 ఎంపీ కెమెరా ఉంది. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 15 వాట్‌ అడాప్టివ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 38 గంటలపాటు నిరంతరాయంగా ఫోన్‌కాల్స్‌ మాట్లాడొచ్చని శాంసంగ్‌ తెలిపింది. ఈ ఫోన్‌ 6 జీబీ ర్యామ్‌/ 128 జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్‌లో లభిస్తుంది. దీని ధర రూ. 18,499. బ్లాక్‌, మింట్‌ రంగుల్లో లభిస్తుంది. శాంసంగ్‌ ఇండియా వెబ్‌సైట్‌లో ఫోన్‌ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు