Google Meet: వెరైటీ మాస్కులు పెట్టేయండి!

 ఆన్‌లైన్‌ వేదిక గూగుల్‌ మీట్‌ తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లు తమ స్నేహితులు, బంధువులకు వీడియో కాల్‌ చేసినప్పుడు సరదాగా వీటిని వాడుకోవచ్చు...

Published : 16 Jul 2021 00:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్‌ వేదిక గూగుల్‌ మీట్‌ తన యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ యూజర్లు తమ స్నేహితులు, బంధువులకు వీడియో కాల్‌ చేసినప్పుడు సరదాగా వారిని ఆటపట్టించేందుకు వెరైటీగా ఉండే మాస్కులను, ఎఫెక్ట్‌లను వాడుదాం అనుకుంటారు. అలాంటి వారి కోసం వీడియో ఫిల్టర్స్‌, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌, ఆగ్మెంటెడ్‌ రియాల్టీ (ఏఆర్‌) మాస్కులను గూగుల్ జత చేసింది. కామిక్‌, యానిమల్స్‌ వంటి మాస్కులను పెట్టడం ద్వారా భలేగా ఉంటుంది. వీడియో కాల్‌ చేసినప్పుడు కిందిభాగంలో వాటికి సంబంధించిన ఐకాన్స్‌ కనిపిస్తాయి. అయితే అదనంగా జోడించిన ఫీచర్లన్నీ రావాలంటే మీ ‘గూగుల్‌ మీట్‌’కు వ్యక్తిగత జీమెయిల్‌తో అనుసంధానం అయి ఉండాలి. కార్యాలయాలు, ఆఫీస్‌ యూజర్లైతే కొన్ని ఆప్షన్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని గూగుల్‌ పేర్కొంది. 

గతేడాది జీమెయిల్‌ ఖాతా కలిగిన యూజర్లకు ఉచితంగా గూగుల్ మీట్‌ సేవలను గూగుల్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారీ ప్రణాళికతోనే గూగుల్‌ ఇలాంటి వీడియో ఎఫెక్ట్‌లను అదనంగా జోడించింది. ఎంటర్‌ప్రైజెస్, బిజినెస్‌ యూజర్లతోపాటు వ్యక్తిగత వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని అదనపు ఫీచర్లను విడుదల చేసినట్లు గూగుల్‌ తెలిపింది. అలానే అన్ని ఆండ్రాయిడ్‌ ఫోన్లలో వచ్చే గూగుల్‌ డ్యూ యాప్‌నకు ప్రత్యామ్నాయంగా ‘గూగుల్‌ మీట్‌’ను ప్రమోట్‌ చేయనుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. గూగుల్‌ మీట్‌ యాప్‌నకు సంబంధించి ఫీచర్లను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూనే ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని