WhatsApp: ఇక గ్రూప్‌ కాల్స్‌లో ఎప్పుడైనా..

కొద్దిరోజుల క్రితం మల్టీ డివైజ్‌ సపోర్ట్ ఫీచర్‌ను పరిచయం చేసిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చింది. జాయిన్‌ గ్రూప్‌ కాల్స్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ సాయంతో యూజర్స్ గ్రూప్‌ కాల్‌ మధ్యలో ఎప్పుడైనా జాయిన్ కావచ్చు.

Updated : 29 Jun 2023 15:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొద్దిరోజుల క్రితం మల్టీ డివైజ్‌ సపోర్ట్ ఫీచర్‌ను పరిచయం చేసిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకొచ్చింది. జాయిన్‌ గ్రూప్‌ కాల్స్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ సాయంతో యూజర్స్ గ్రూప్‌ కాల్‌ మధ్యలో ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. అనేక సందర్బాల్లో మనకు గ్రూప్‌ కాల్‌ వచ్చినప్పుడు వేరేలో పనిలో బిజీగా ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతుంటాం. కొద్దిసేపటి తర్వాత మీరు వాట్సాప్ ఓపెన్ చేసినప్పుడు గ్రూప్ కాల్ ఇంకా కొనసాగుతుంటే స్క్రీన్‌ మీద మీకు జాయిన్, ఇగ్నోర్ అనే రెండు ఆప్షన్లు  కనిపిస్తాయి. వాటిలో జాయిన్‌పై క్లిక్ చేసి గ్రూప్‌ కాల్‌లో జాయిన్ కావొచ్చు. దీంతో యూజర్ ప్రతిసారి గ్రూప్‌ కాల్ కోసం ఎదురుచూడక్కర్లేదని, కాల్‌ లిఫ్ట్‌ చేయకపోయినా బాధపడాల్సిన అవసరం లేదని వాట్సాప్‌ తెలిపింది.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ ద్వారా 8 మంది యూజర్స్ ఒకేసారి గ్రూప్‌ కాలింగ్‌లో పాల్గొనవచ్చు. ప్రస్తుతం కొద్ది మంది యూజర్స్‌కి మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. దీంతోపాటు కాల్ ఇన్ఫో స్క్రీన్ పేరుతో మరో కొత్త ఫీచర్‌తో గ్రూప్‌ కాలింగ్‌కి ఎవరిని ఆహ్వానించాం..కాల్‌లో ఎవరెవరు జాయిన్ అయ్యారు అనేది తెలుసుకోవచ్చు. అలానే కాల్  ప్రారంభం నుంచి ఉన్నవారు..మధ్యలో జాయిన్ అయిన వారి వివరాలు కూడా తెలుస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని