ఐవోఎస్‌ యూజర్లకు వాట్సాప్‌ షాక్..!

ఐవోఎస్‌ యూజర్లకు మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ షాక్ ఇవ్వనుందా...? ఇక నుంచి ఐవోఎస్ 9తో రన్‌ అయ్యే ఐఫోన్లలో...

Updated : 07 Mar 2021 20:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐవోఎస్‌ యూజర్లకు మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ షాక్..! ఇక నుంచి ఐవోఎస్ 9తో రన్‌ అయ్యే ఐఫోన్లలో వాట్సాప్‌ తన సేవలను నిలిపివేసింది. వాట్సాప్‌ అడిగిన ఎఫ్‌ఏక్యూ (FAQ) పేజీని యాపిల్‌ అప్‌డేట్‌ చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టెక్‌ వర్గాలు పేర్కొన్నాయి. బీటా వెర్షన్‌ 2.21.50తో నడుస్తున్న ఐవోఎస్‌ డివైజ్‌ల్లో ఇక వాట్సాప్‌ను వినియోగంచలేవని వెల్లడించాయి. అయితే ఐవోఎస్‌ 9తోపాటు కొత్త వెర్షన్స్‌ ఐఫోన్లకు మెసేంజర్‌ మద్దతుగా ఉంటుందని వాట్సాప్‌ అధికారిక పేజీ పేర్కొంది. ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 4.0.3 లేదా అంతకంటే కొత్త వెర్షన్‌లో మెసేంజర్‌ యాప్‌ పని చేస్తుందని స్పష్టం చేసింది. ఐవోస్‌ 9 వెర్షన్‌ను మాత్రమే కాకుండా Kaios 2.5.1 వెర్షన్‌తో రన్‌ అయ్యే జియో ఫోన్‌, జియో ఫోన్‌2 లో సేవలను వాట్సాప్‌ రిస్ట్రిక్ట్‌ చేసింది. ఐవోఎస్‌ 9 యూజర్లు తమ డేటాను ఆఫ్‌లైన్‌లో బ్యాకప్‌ చేసుకోవాలని సూచించింది. ఐక్లౌడ్‌, గూగుల్‌ డ్రైవ్‌ల్లోకి ఎక్స్‌పోర్ట్‌ చేసుకోవాలని పేర్కొంది.

వాట్సాప్‌ కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసిందని వుయ్‌బీటాఇన్‌ఫో నివేదిక వెల్లడించింది. ఆర్కివ్‌డ్‌ చాట్‌ వెర్షన్‌ను మెరుగుపరచనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం డెవలప్‌మెంట్‌ స్టేజ్‌లో ఉందని త్వరలోనే తీసుకొస్తుందని పేర్కొంది. ఇప్పుడు గ్రూప్‌ను ఆర్కివ్స్‌లో పెట్టేస్తే మళ్లీ ఎవరైనా మెసేజ్‌ పంపిస్తే అప్పుడు మనకు కనిపిస్తుంది. అయితే కొత్త అప్‌డేట్‌లో.. ఆ గ్రూప్‌లో యూజర్‌ చాట్‌ చేస్తేనే ఆర్కివ్స్‌ కనిపించేలా వాట్సాప్‌ తీర్చిదిద్దనుంది. ప్రస్తుతం ఆర్కివ్‌ గ్రూప్‌లు వాట్సాప్‌ అట్టడుగున కనిస్తున్నాయి. ఫీచర్‌ను ప్రైవేట్‌ కాకుండా పబ్లిక్‌ చేసినప్పుడు, ఆర్కివ్స్‌ చేసిన చర్చలన్నీ ఆటోమేటిక్‌గా అన్‌ఆర్కివ్‌డ్‌ కాలేవు. అన్ని నోటిఫికేషన్‌లు నిలిపివేయబడతాయి. అయితే ఇది ఆప్షనల్‌ ఫీచర్‌గా ఉంటుందని టెక్‌ వర్గాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు