Special Trains: దసరాకు ప్రత్యేక రైళ్లు, అదనపు బోగీలు

దసరా పండగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జోన్‌ పరిధిలో, జోన్‌ మీదుగా రానుపోను 12 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎనిమిది రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేయనున్నట్లు

Updated : 30 Sep 2022 08:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: దసరా పండగకు ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని జోన్‌ పరిధిలో, జోన్‌ మీదుగా రానుపోను 12 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ఎనిమిది రైళ్లకు అదనపు బోగీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. సికింద్రాబాద్‌-సాంతరాగాఛి-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-షాలిమార్‌-సికింద్రాబాద్‌, నాందేడ్‌-బెర్హంపుర్‌-నాందేడ్‌, త్రివేండ్రం-టాటానగర్‌-త్రివేండ్రం మధ్య ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు పేర్కొంది. సికింద్రాబాద్‌-దర్భంగా-సికింద్రాబాద్‌ రైళ్లకు రెండేసి, సికింద్రాబాద్‌-హిస్సార్‌-సికింద్రాబాద్‌, హైదరాబాద్‌-హడప్‌సర్‌- హైదరాబాద్‌ రైళ్లకు ఒక్కో స్లీపర్‌ బోగీ అదనంగా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది.

పలు రైళ్ల ప్రయాణ వేళల మార్పు

కొన్ని రైళ్ల ప్రయాణవేళలు అక్టోబరు 1 నుంచి మారనున్నాయని, సవరించిన సమయాల్ని ప్రయాణికులు రైలు ఎక్కడానికి ముందే తెలుసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే గురువారం సూచించింది. రైలు టికెట్ల రిజర్వేషన్ల సమయంలో ప్రయాణికుల ఫోన్‌ నంబర్లు ఇస్తే.. ప్రయాణ సమయం మార్పు, ఆలస్యంగా నడవడం వంటి సమాచారం వారికి అందుతుందని పేర్కొంది.  ఎంక్వైరీ నంబరు 139కి, నేషనల్‌ ట్రైన్‌ ఎంక్వైరీ సిస్టమ్‌(ఎన్టీఈఎస్‌), ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్లు, రైల్వేస్టేషన్లు, దగ్గరలోని రిజర్వేషన్‌ కౌంటర్లలో సంప్రదించి రైళ్ల సమయాలు తెలుసుకోవాలని సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌ సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని