సనోఫి టీకా తయారీకి నిమ్స్‌లో ప్రయోగాలు

కరోనా లాంటి మహమ్మారులను ఎదుర్కొనేందుకు అనువుగా సనోఫి టీకా తయారీకి పంజాగుట్ట నిమ్స్‌ ఆసుపత్రిలో ప్రయోగాలు జరుగుతున్నాయని ఆసుపత్రి క్లినికల్‌ ఫార్మాకాలజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌, టీకా ఇన్వెస్టిగేటర్‌ డా.ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

Updated : 02 Oct 2022 05:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: కరోనా లాంటి మహమ్మారులను ఎదుర్కొనేందుకు అనువుగా సనోఫి టీకా తయారీకి పంజాగుట్ట నిమ్స్‌ ఆసుపత్రిలో ప్రయోగాలు జరుగుతున్నాయని ఆసుపత్రి క్లినికల్‌ ఫార్మాకాలజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌, టీకా ఇన్వెస్టిగేటర్‌ డా.ప్రభాకర్‌రెడ్డి అన్నారు. శనివారం ఆసుపత్రిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ ఔషధ నాణ్యత, నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీవో) డిప్యూటీ కంట్రోలర్‌ డాక్టర్‌ రామకృష్ణ, నిమ్స్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌ రామ్మూర్తితో పాటు నగరంలోని వివిధ ఆసుపత్రులకు చెందిన ఎథిక్స్‌ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యూ క్లినికల్‌ ట్రయల్స్‌ రూల్స్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. సనోఫి టీకాపై ఆసుపత్రిలో మూడో దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయని న్నారు. ఇందులో 80 మంది వాలంటీర్లు పాల్గొన్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని