ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షోకాజ్‌ నోటీసులు!

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మంగళవారం మంగళ్‌హాట్‌ పోలీసులు షోకాజ్‌ నోటీసు జారీచేశారు.

Updated : 07 Dec 2022 10:30 IST

ఈనాడు, హైదరాబాద్‌: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు మంగళవారం మంగళ్‌హాట్‌ పోలీసులు షోకాజ్‌ నోటీసు జారీచేశారు. హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించి అనుచిత వ్యాఖ్యలతో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ఉంచారని పేర్కొన్నారు. ఇటీవల పోలీసులు పీడీ యాక్ట్‌ ప్రయోగించి చర్లపల్లి జైలుకు తరలించగా అనంతరం ఆయన హైకోర్టును ఆశ్రయించి విడుదలయ్యారు. ఆ సందర్భంగా బహిరంగంగా, సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత ప్రసంగాలు చేయకూడదని హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాలను ఉల్లంఘించారంటూ పోలీసులు షోకాజ్‌ నోటీసులో పేర్కొన్నారు. రెండురోజుల్లో షోకాజు నోటీసుకు సమాధానం ఇవ్వాలన్నారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు