Khammam-Vijayawada: ఖమ్మం-విజయవాడ.. 4 వరుసల గ్రీన్‌ఫీల్డ్‌ హైవే

తెలంగాణలో ఎన్‌హెచ్‌-163జిపై ఖమ్మం-విజయవాడ మధ్య 4 వరుసల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మంగళవారం ట్వీట్‌ చేశారు.

Updated : 15 Mar 2023 09:10 IST

29.92 కి.మీ. నిర్మాణానికి రూ.983 కోట్ల మంజూరు

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో ఎన్‌హెచ్‌-163జిపై ఖమ్మం-విజయవాడ మధ్య 4 వరుసల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవేను అభివృద్ధి చేయనున్నట్లు కేంద్ర రహదారి, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ మంగళవారం ట్వీట్‌ చేశారు. ఆర్థిక నడవాలో భాగంగా వి.వెంకటాయపాలెం నుంచి బ్రాహ్మణపల్లి గ్రామాల మధ్య మొదటి ప్యాకేజీలో భాగంగా ఈ నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. హైబ్రిడ్‌ యాన్యుటీ మోడ్‌లో చేపట్టే ఈ 29.92 కిలోమీటర్ల నిర్మాణానికి రూ.983.90 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల వాహన నిర్వహణ వ్యయం, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతాయని గడ్కరీ పేర్కొన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య రహదారి వసతులను పెంచి దక్షిణాదిలోని పోర్టులను మధ్యభారతంతో అనుసంధానించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యమని కేంద్ర మంత్రి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు