రూ.1,534 కోట్లతో అచ్చంపేట ఎత్తిపోతలకు పరిపాలన అనుమతులు!

కృష్ణా జలాల ఆధారంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు నిర్మించనున్న ఎత్తిపోతల పథకానికి రూ.1534 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.

Published : 04 May 2023 04:20 IST

ఈనాడు, హైదరాబాద్‌: కృష్ణా జలాల ఆధారంగా నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు నిర్మించనున్న ఎత్తిపోతల పథకానికి రూ.1534 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. అచ్చంపేట నియోజకవర్గంలో 57,200 ఎకరాలకు ఈ ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందించాలనేది లక్ష్యం. గత కొంతకాలంగా అచ్చంపేట, అమ్రాబాద్‌ మండలాలతో పాటు పరిసర ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించేందుకు నీటిపారుదలశాఖ పలు ప్రతిపాదనలు రూపొందించింది. ఈ క్రమంలో ఎత్తిపోతల నిర్మాణానికి తాజాగా ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని