11న ఘనంగా సాహిత్య దినోత్సవాలు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 11న రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా తెలంగాణ సాహిత్య దినోత్సవాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ తెలిపారు.

Published : 06 Jun 2023 03:16 IST

ఈనాడు, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 11న రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా తెలంగాణ సాహిత్య దినోత్సవాలను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సాహిత్య అకాడమీ ఛైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ తెలిపారు. 33 జిల్లాల్లో కలెక్టర్‌ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో కవి సమ్మేళనాలు జరుగుతాయని తెలిపారు. సోమవారం ఆయన తమ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో విస్మృతికి గురైన తెలంగాణ సాహిత్యాన్ని సీఎం కేసీఆర్‌ స్వరాష్ట్రం వచ్చాక వెలుగులోకి తెచ్చారని, దాశరథి, కాళోజీ, సినారె, బిరుదురాజు రామరాజు, భాగ్యరెడ్డివర్మ, కొమర్రాజు, బీఎన్‌ శాస్త్రి, బోయ జంగయ్య, జాతశ్రీ లాంటి తెలంగాణ తేజోమూర్తులను, ప్రగతిశీలురను పాఠ్య పుస్తకాల సిలబస్‌లోని తేవడం విప్లవాత్మక పరిణామంగా మారిందని తెలిపారు. 11న జిల్లాల్లో జరిగే కవి సమ్మేళనాల్లో  ఉత్తమపద్యాలు, కవితలను కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీ ఎంపిక చేసి రాష్ట్రస్థాయి పోటీకి  పంపిస్తుందని చెప్పారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా వచన, పద్య కవిత విభాగాల్లో ప్రథమ బహుమతి రూ.1,00,116, ద్వితీయ బహుమతి రూ.75,116, తృతీయ బహుమతి రూ.60,116, చతుర్థ బహుమతి రూ.50,116, పంచమ బహుమతి రూ.30,116 ఇస్తామన్నారు. సమ్మేళనాల్లో పాల్గొన్న కవుల కవితలు, పద్యాలను సాహిత్య అకాడమీ పుస్తకాలుగా వెలువరిస్తుందని గౌరీశంకర్‌ చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని