మట్టి ఫ్రిజ్‌తో చల్లచల్లగా.. కరెంట్‌ అవసరం లేకుండానే..

మార్చి ప్రారంభంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫ్రిజ్‌లు, కూలర్ల వాడకం అనివార్యమవుతోంది. ఈ నేపథ్యంలో విద్యుత్తు అవసరంలేకుండా మట్టితో తయారు చేసిన ఫ్రిజ్‌ ఒకటి అందరినీ ఆకట్టుకుంటోంది.

Updated : 11 Mar 2024 08:42 IST

ఈనాడు, ఆదిలాబాద్‌: మార్చి ప్రారంభంలోనే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫ్రిజ్‌లు, కూలర్ల వాడకం అనివార్యమవుతోంది. ఈ నేపథ్యంలో విద్యుత్తు అవసరంలేకుండా మట్టితో తయారు చేసిన ఫ్రిజ్‌ ఒకటి అందరినీ ఆకట్టుకుంటోంది. ఆదిలాబాద్‌ పట్టణానికి చెందిన విశ్రాంత అధ్యాపకుడు కన్నం మోహన్‌బాబు ఇంట్లో మట్టి ఫ్రిజ్‌ను రాజస్థాన్‌ నుంచి తెప్పించి వాడుతున్నారు. విద్యుత్తు అవసరం లేకుండానే అందులో ఉంచిన వస్తువులు ఏడు రోజుల పాటు నిల్వ ఉంటాయి. వారం రోజులకోసారి దీన్ని శుభ్రం చేయాలి. ఫ్రిజ్‌ పైభాగంలో మంచినీటిని నింపాలి. ఫ్రిజ్‌కు మూడు వైపులా ఉన్న గోడల్లోకి పొరల ద్వారా ఆ నీరు చేరుతుంది. రెండు గంటల తరువాత ఫ్రిజ్‌ చల్లగా మారుతుంది. పర్యావరణంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే దీని ధర రూ.8 వేలు అని మోహన్‌బాబు తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని