నేడు కర్ణాటకకు ఇంజినీర్ల బృందం

రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. కర్ణాటకలోని నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆ రాష్ట్రాన్ని కోరనుంది.

Published : 01 May 2024 02:48 IST

నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల విడుదలకు విజ్ఞప్తి
ప్రాజెక్టుల్లో మట్టాలపై అధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమావేశం 

ఈనాడు, హైదరాబాద్‌: రాబోయే రోజుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. కర్ణాటకలోని నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆ రాష్ట్రాన్ని కోరనుంది. ఈ మేరకు నాగర్‌కర్నూల్‌ చీఫ్‌ ఇంజినీర్‌ విజయ్‌భాస్కర్‌ నేతృత్వంలో ఇంజినీర్ల బృందం బుధవారం బెంగళూరు వెళ్లనుంది. గురువారం ఆ రాష్ట్ర జలవనరులశాఖ అధికారులతో ఇంజినీర్లు సమావేశం కానున్నారు. ప్రాజెక్టులో అందుబాటులో ఉన్న నీరు, ఆ రాష్ట్ర అవసరాలపై చర్చించి తెలంగాణ విజ్ఞప్తిని తెలియజేయనున్నారు. మరోవైపు మంగళవారం హైదరాబాద్‌లోని జలసౌధలో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని జలాశయాల్లో తాగునీటి అవసరాలకు ఉన్న నిల్వలపై చర్చించినట్లు తెలిసింది. కర్ణాటక నుంచి నీటి విడుదలకు చేపట్టాల్సిన కార్యాచరణ, కాళేశ్వరం జ్యుడిషియల్‌ కమిషన్‌ విచారణ పురోగతిపైనా ఆరా తీసినట్లు తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని